Share News

IPL 2025 Black Tickets Uppal: ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ఎంట్రీతో..

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:45 PM

SRH vs RR: ఐపీఎల్ కప్పు వేటను శనివారం నాడు మొదలుపెట్టనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IPL 2025 Black Tickets Uppal: ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ఎంట్రీతో..
SRH vs RR Match Tickets

ఐపీఎల్ నయా సీజన్ మొదలవడానికి ఇంకా మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగే తొలిపోరుతో మెగా సంబరం షురూ కానుంది. ఇకపై రోజుకో పోరాటంతో ఆడియెన్స్‌ను అలరించేందుకు అంతా సిద్ధమైపోయింది. తెలుగు అభిమానుల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఎలాగూ ఉన్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపింది. ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్‌లో అప్పుడే బ్లాక్ టికెట్ల దందా స్టార్ట్ అయిపోయింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్‌కు బ్లాక్ టిక్కట్ల దందా మొదలైంది.


టికెట్లు స్వాధీనం

ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద సన్‌రైజర్స్-రాజస్థాన్ మ్యాచ్ టికెట్లను భరద్వాజ్ అనే ఓ వ్యక్తి బ్లాక్‌లో అమ్ముతూ కనిపించాడు. దీంతో అతడ్ని ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి 4 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భరద్వాజ్‌ వద్ద దొరికిన టికెట్లను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


షెడ్యూల్ ఇదే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచుల్లో భాగంగా 7 మ్యాచులు ఉప్పల్‌లోనే ఆడనుంది. ఇందులో రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌తో పాటు మార్చి 27న లక్నో సూపర్ జియాంట్స్, ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది సన్‌రైజర్స్. హోం మ్యాచుల్లో విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు బలపడతాయి. మరి.. కమిన్స్ సేన గతేడాది పెర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.


ఇవీ చదవండి:

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..

RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 02:04 PM