Virat Kohli Ring: వైరల్ అవుతున్న కోహ్లీ రింగ్.. దీని హిస్టరీ తెలుసా..
ABN, Publish Date - Apr 06 , 2025 | 07:56 PM
Indian Premier League: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బాగానే రాణిస్తున్నాడు. ఆర్సీబీ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈసారి బ్యాటింగ్ ద్వారా కాకుండా ఓ రింగ్ ద్వారా అతడు వార్తల్లో నిలిచాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా నెట్టింట వైరల్ అయిపోతుంది. అతడి బ్యాటింగ్ దగ్గర నుంచి బిహేవియర్ వరకు ప్రతి దాని గురించి అభిమానులు, సోషల్ మీడియాలో నెటిజన్స్ డిస్కస్ చేస్తుంటారు. తన పెర్ఫార్మెన్స్ ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే కింగ్.. ఈసారి ఓ రింగ్ ద్వారా వైరల్ అవుతున్నాడు. అతడి చేతికి ఉన్న ఉంగరం గురించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అది మామూలు రింగ్ కాదు. దానికి పెద్ద కథే ఉంది. కింగ్ ఎప్పటికీ షేర్ చేసుకునే మెమరీస్ దానికి ఉన్నాయి. మరి.. ఏంటా రింగ్.. దాని వెనుక స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
మామూలుది కాదు
ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్న కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్‌లో సాధ్యమైనంతగా పాజిటివిటీని నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. తొలి కప్పు వేటలో ఉన్న విరాట్.. జూనియర్లతో పాటు సీనియర్లు, ఫారెన్ క్రికెటర్స్‌నూ కలుపుకొని పోతున్నాడు. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకుంటున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ ఎన్విరాన్‌మెంట్ నెలకొల్పుతున్నాడు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి చేతికి ఉన్న పర్పుల్ కలర్ రింగ్ అందరి కంటా పడింది. ఇది మామూలు ఉంగరం కాదు.. టీ20 వరల్డ్ కప్-2024 గెలిచినప్పుడు అందుకున్న ఉంగరం.
అదే ఎనర్జీతో..
పొట్టి ప్రపంచ కప్‌లో పెర్ఫార్మెన్స్‌కు కానుకగా దక్కినది కావడంతో ఉంగరాన్ని చేతికి వేసుకొని కనిపించాడు కింగ్. స్ఫూర్తిని మరింత పెంచేందుకు, ఇతర యంగ్‌స్టర్స్‌కూ ఆ ఎనర్జీని ఫార్వర్డ్ చేసేందుకు అతడు ఉంగరాన్ని ధరించి ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు. టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ 151 రన్స్ చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో 76 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అదే ఫైటింగ్ స్పిరిట్‌ను ఇక్కడా కంటిన్యూ చేసేందుకు రింగ్‌ను చేతికి ధరించాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
నేను ఆడాలా, వద్దా డిసైడ్ చేసేది అదే: ధోనీ
ఎస్‌ఆర్‌హెచ్ లెక్కలు తేల్చాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 06 , 2025 | 07:59 PM