MI vs DC Rohit Sharma: ఒక్క మాటతో రిజల్ట్ తారుమారు.. ఇందుకే రోహిత్ గ్రేట్ అనేది
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:45 PM
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మాటతో మ్యాచ్ చేంజ్ చేసేశాడు. అప్పటివరకు ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గేలా చేశాడు హిట్‌మ్యాన్. మరి.. అతడు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో ఆటగాళ్లందరి కంటే కూడా కెప్టెన్ ఎక్కువ అలర్ట్‌గా ఉండాలి. మ్యాచ్‌ను నిశితంగా పరిశీలిస్తూ సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్‌ను పోటీలో ఉంచాలి. మ్యాచ్ చేజారే ప్రమాదం ఏర్పడితే.. అప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నాలి. అయితే సారథి ఒక్కడితోనే అంతా అయిపోదు. అతడికి సీనియర్ ఆటగాళ్లు కూడా సాయం అందించాలి. స్ట్రాటజీ ప్లానింగ్‌లో హెల్ప్ చేయాలి. అప్పుడే టీమ్ విజయపథంలో దూసుకెళ్తుంది. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఇది మరోమారు ప్రూవ్ అయింది. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాజీ సారథి రోహిత్ శర్మ ఇచ్చిన ఒక సలహా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. మరి.. ఆ సజెషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
రిస్క్ చేసి మరీ..
ముంబై వర్సెస్ డీసీ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. ఓవర్లన్నీ ఆడి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన డీసీ.. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 119 పరుగులతో పటిష్టంగా ఉంది. విజయానికి ఇంకో 60 బంతుల్లో 86 పరుగులు కావాలి. రిక్వైర్డ్ రన్‌రేట్ పెద్దగా లేకపోవడం, చేతిలో 8 వికెట్లు ఉండటం, కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) రెచ్చిపోయి ఆడుతుండటంతో ఢిల్లీ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ మూడు ఓవర్లలో ఆట మొత్తం మారిపోయింది. దీనికి క్రెడిట్ రోహిత్‌కు ఇవ్వాలి. తేమ కారణంగా 11వ ఓవర్‌లో కొత్త బంతిని తీసుకుంది ముంబై. దీంతో స్పిన్నర్లను రంగంలోకి దించాలని కెప్టెన్ హార్దిక్‌కు సూచించాడు హిట్‌మ్యాన్. రన్స్ లీక్ అయ్యే రిస్క్ ఉన్నా ఫర్వాలేదని అతడికి ధీమా ఇచ్చాడు.
సంతోషం పట్టలేక..
రోహిత్ మాటలు విన్న పాండ్యా శాంట్నర్, కర్ణ్ శర్మను బౌలింగ్‌కు దింపాడు. దీంతో అప్పటివరకు జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న డీసీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. నాయర్‌తో పాటు అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రజ్ నిగమ్‌లు 36 బంతుల వ్యవధిలో ఔట్ అయ్యారు. తక్కువ గ్యాప్‌లో 5 వికెట్లు పడటంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. క్లోజ్ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ సలహా వర్కౌట్ అవడం, శాంట్నర్-కర్ణ్ శర్మ కలసి 5 వికెట్లు పడగొట్టడం, పోయిందనుకున్న మ్యాచ్‌లో నెగ్గడంతో పాండ్యా సంతోషం పట్టలేకపోయాడు. డగౌట్‌లో కూర్చున్న రోహిత్‌కు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. దీంతో హిట్‌మ్యాన్ నవ్వుల్లో మునిగిపోయాడు. భలే ఆడారంటూ చప్పట్లతో అభినందించాడు. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్ స్కెచ్ వేస్తే ఇట్లుంటదని, ఒక్క మాటతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
యూపీఐ కంపెనీలకు ఐపీఎల్ బెట్టింగ్ ఫీవర్
పార్క్‌హయత్‌లో అగ్నిప్రమాదం.. అక్కడే ఎస్‌ఆర్‌హెచ్..
బుమ్రాతో ఆడుకున్న ఢిల్లీ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి