Share News

MS Dhoni-Ajinkya Rahane: ధోని పరువు తీసిన కేకేఆర్.. మరీ ఇంత దారుణమా..

ABN , Publish Date - Apr 12 , 2025 | 10:41 AM

IPL 2025: చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన లెజెండ్ ధోని.. దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. తన టీమ్‌ సీఎస్‌కేను అతడు కాపాడలేకపోయాడు. దానికి తోడు బ్యాటింగ్‌ టైమ్‌లో మాహీ పరువు తీసేలా కేకేఆర్ వ్యవహరించిన తీరు ఫ్యాన్స్‌ను మరింత హర్ట్ చేస్తోంది.

MS Dhoni-Ajinkya Rahane: ధోని పరువు తీసిన కేకేఆర్.. మరీ ఇంత దారుణమా..
CSK vs KKR

చెన్నై సూపర్ కింగ్స్ తీరు మారలేదు. వరుసగా ఐదో పరాభవాన్ని మూటగట్టుకుంది సీఎస్‌కే. సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఎల్లో ఆర్మీ. ఆ జట్టు సంధించిన 103 పరుగుల టార్గెట్‌ను సగం ఓవర్లు కూడా పూర్తవక ముందే ఉఫ్‌మని ఊదిపారేశారు కేకేఆర్ బ్యాటర్లు. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానానికి పడిపోయింది చెన్నై. అయితే ఓటమి కంటే కూడా చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన లెజెండ్ ధోనీకి జరిగిన అవమానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మాహీని ఎవరు అవమానించారు.. ఏం జరిగింది అనేది తెలుసుకుందాం..


టీ20నా.. టెస్టా..

సీఎస్‌కే ఇన్నింగ్స్ సమయంలో ధోని బ్యాటింగ్‌కు రాగానే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మొత్తం ఫీల్డ్‌ సెట్ చేంజ్ చేశాడు. ఎక్కువ మంది ఫీల్డర్లను సర్కిల్ లోపల మోహరించాడు. టోటల్ అటాకింగ్ ఫీల్డ్ సెట్‌తో ధోనీని క్రీజులో నుంచి కదలాలంటే భయపడేలా చేశాడు. స్లిప్స్‌లో ఒకర్ని, షార్ట్ లెగ్‌లో మరో ఫీల్డర్‌ను పెట్టి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో అటాకింగ్ డెలివరీస్ వేయించాడు రహానె. అసలు ఇది.. టెస్ట్ మ్యాచా.. టీ20 మ్యాచా.. అనే ఫీలింగ్ కలిగించాడు. సింగిల్ తీయడానికి మాహీని ఆపసోపాలు పడేలా చేశాడు.


గంభీర్‌లాగే రహానె..

ధోని లాంటి పించ్ హిట్టర్లకు ఎవ్వరైనా బౌండరీ లైన్ దగ్గర టైట్ ఫీల్డింగ్ సెట్ చేస్తారు. ఫోర్లు, సిక్సులు కొడతాడు కాబట్టి వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ రహానె మాత్రం సింగిల్ తీయాలంటే భయపడేలా చేశాడు. దీంతో నెక్స్ట్ నరైన్ వేసిన ఓవర్‌లో ఔట్ అయ్యాడు మాహీ. కేకేఆర్ ధోనీకి ఇలా ఫీల్డింగ్ సెట్ చేయడం ఇదేం కొత్త కాదు. 2016 ఎడిషన్‌లో అప్పటి కెప్టెన్‌ గౌతం గంభీర్.. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్, సిల్లీ పాయింట్‌లో ఫీల్డర్లను మోహరించి ప్రైమ్ ఫామ్‌లో ఉన్న మాహీని భయపెట్టాడు. తాజా ఐపీఎల్‌లో ఆర్సీబీ కూడా ధోనీపై ఇదే తరహా ఫీల్డింగ్‌తో ప్రెజర్‌లోకి నెట్టింది. ఇవి చూసిన కొంత మంది నెటిజన్స్.. ధోనీని కేకేఆర్ మరోసారి అవమానించిందని, సింగిల్ కూడా ఇవ్వకుండా టెస్ట్ ఫీల్డింగ్‌తో అతడి పరువు తీసిందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ధోనీ ఔట్ కాలేదా.. తప్పు ఎవరిది

ఇది నా గ్రౌండ్‌

సన్‌రైజర్స్‌ రాత మారేనా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 10:45 AM