Share News

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బసచేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ఇప్పుడు ప్లేయర్లు ఎలా ఉన్నారంటే

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:45 PM

Fire Accident: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బస చేస్తున్న ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు ప్రస్తుతం ఎలా ఉన్నారు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బసచేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ఇప్పుడు ప్లేయర్లు ఎలా ఉన్నారంటే
Sunrisers Hyderabad

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ పార్క్ హయత్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. ఇదే హోటల్‌లోని ఆరో అంతస్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బస చేస్తుండటంతో ప్లేయర్ల ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతుున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు.. అని అంతా టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఆరెంజ్ ఆర్మీ సేఫ్

పార్క్ హయత్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్ అంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది త్వరగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హోటల్‌లో బస చేస్తున్న సన్‌రైజర్స్ ఆటగాళ్లు అంతా సేఫ్‌గా ఉన్నారని హోటల్ స్టాఫ్ తెలిపారు. ఆటగాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించి రెండు బస్సుల్లో వేరే ప్లేస్‌కు తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. కాటేరమ్మ కొడుకులు సేఫ్ అని అంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్‌‌లో సన్‌రైజర్స్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కమిన్స్ సేన.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక టీమ్ పనైపోయిందని అందరూ అనుకుంటున్న వేళ ఆరో మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది ఆరెంజ్ ఆర్మీ. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది ఎస్‌ఆర్‌హెచ్.


ఇవీ చదవండి:

రిటైర్మెంట్ ముచ్చటే లేదు

నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్

రోహిత్ మాటతో రిజల్ట్ తారుమారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 03:52 PM