Share News

Team India: నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

ABN , Publish Date - Jan 30 , 2025 | 06:17 PM

IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ముందు టీమిండియాకు సూపర్ న్యూస్. జట్టులోకి మహాబలుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అపోజిషన్ బౌలర్లకు దబిడిదిబిడేనని చెప్పాలి.

Team India: నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
Team India

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. వరుసగా రెండు టీ20ల్లో విజయాలు సాధించి ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంకో గెలుపు సాధిస్తే సిరీస్ సొంతమయ్యేది. కానీ రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దీంతో నాలుగో టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. పూణెలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఒకవేళ ఓడితే సిరీస్ కోసం ఆఖరి మ్యాచ్‌లో మళ్లీ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ కీలక తరుణంలో భారత జట్టుకు సూపర్ న్యూస్. విధ్వంసక బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను వన్‌సైడ్ చేసే మహాబలుడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


ఫుల్ ఫిట్!

టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్ రెండో టీ20 నుంచి అతడు తప్పుకున్నాడు. ఆ తర్వాత రాజ్‌కోట్ మ్యాచ్‌కూ అతడు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న లెఫ్టాండ్ బ్యాటర్.. ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని స్వయంగా భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ‘రింకూ సింగ్ ఫిట్‌గా ఉన్నాడు. రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. నిన్న రాత్రి ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడు బ్యాటింగ్ కూడా చేశాడు’ అని డొషేట్ చెప్పిటన్లు వినిపిస్తోంది. అయితే రింకూ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి బరిలోకి దిగుతాడా? లేదా? ఇప్పుడే చెప్పలేం.


బౌలర్లకు దబిడిదిబిడే!

రింకూ రాకపై సోషల్ మీడియాలోనూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అతడు ఫుల్‌ ఫిట్‌గా ఉంటేనే ఆడించాలని.. అంత తొందర లేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రింకూ వస్తే కథ వేరేలా ఉంటుందని చెబుతున్నారు. బౌలర్లను చీల్చి చెండాడే ఈ మహాబలుడు జట్టులో ఉంటే మరింత బలం చేకూరుతుందని, ఇంగ్లండ్‌కు ఇక దబిడిదిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన అవకాశాలు రాక రింకూ ఆకలితో ఉన్నాడని.. అవకాశం వస్తే పరుగుల సునామీ సృష్టిస్తాడని నెటిజన్స్ అంటున్నారు. బౌలర్లపై విరుచుకుపడి నరకం చూపిస్తాడని చెబుతున్నారు. మరి.. పుణె టీ20లో రింకూ ఆడతాడో? లేదో? చూడాలి.


ఇదీ చదవండి:

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 06:22 PM