RR vs RCB Phil Slat: ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు.. వార్ వన్ సైడ్ చేసేశాడు
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:52 PM
Indian Premier League: బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ నాక్స్‌కు వేదికగా నిలిచింది ఐపీఎల్. నిన్న ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానును మర్చిపోక ముందే ఆర్సీబీ నుంచి ఇంకో కాటేరమ్మ కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

సన్‌రైజర్స్ చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం ఇంకా అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. సరిపోదా శనివారం.. అంటూ పంజాబ్ కింగ్స్‌కు నిన్న ఓ రేంజ్‌లో పోయించాడు పులి. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించి ఐపీఎల్‌లో ఒక్కసారిగా హీట్ పుట్టించాడు. దాన్ని కొనసాగిస్తూ ఆర్సీబీలోని మరో కాటేరమ్మ కొడుకు ఫిలిప్ సాల్ట్ ఇవాళ చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడిన ఈ విధ్వంసకారుడు.. చూస్తుండగానే ప్రత్యర్థి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాక్కెళ్లిపోయాడు.
వణుకు పుట్టించారు
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సాల్ట్ అదరగొట్టాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 65 పరుగులు చేశాడు. 196 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ అపోజిషన్ బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఆర్చర్ దగ్గర నుంచి ఏ బౌలర్‌నూ వదిలిపెట్టకుండా బాదాడు సాల్ట్. అతడికి తోడుగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 62 నాటౌట్) కూడా చెలరేగడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. 17.3 ఓవర్లలోనే టార్గెట్ 173ని ఊదిపారేసింది బెంగళూరు. సాల్ట్-కోహ్లీ కలసి మొదటి వికెట్‌కు 8.4 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు జోడించారు. సాల్ట్ ఔట్ అయినా దేవ్‌దత్ పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్) కోహ్లీకి సపోర్ట్‌గా ఉంటూ మ్యాచ్‌ను త్వరగా ఫినిష్ చేయడంలో సాయం అందించాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది పాటిదార్ సేన. కాగా, ఈ సీజన్‌లో సీఎస్‌కే, ముంబై, కేకేఆర్‌ను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించిన బెంగళూరు.. ఇవ్వాళ రాజస్థాన్‌ను సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఓడించడం మరో స్పెషల్‌గా నిలిచింది.
ఇవీ చదవండి:
ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి..
ఢిల్లీ వర్సెస్ ముంబై.. లెక్కలు మారుస్తారా..
ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి