Share News

Virat Kohli Record: కోహ్లీ సంచలన రికార్డు.. దీన్ని టచ్ చేసే దమ్ముందా..

ABN , Publish Date - Apr 13 , 2025 | 07:34 PM

RR vs RCB: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రేర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఇంతకీ కింగ్ అచీవ్‌మెంట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli Record: కోహ్లీ సంచలన రికార్డు.. దీన్ని టచ్ చేసే దమ్ముందా..
Virat Kohli

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో సంచలన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన సండే ఫైట్‌లో కింగ్ చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20 కెరీర్‌లో కోహ్లీకి ఇది 100వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో 100 హాఫ్ సెంచరీలో బాదిన తొలి ఆసియా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు ఆర్సీబీ స్టార్. ఇది నెవర్ బిఫోర్ రికార్డ్ అనే చెప్పాలి.


బ్యాటింగ్ అదిరింది

ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ మ్యాచ్‌‌ ఫినిష్ అయ్యే వరకు క్రీజులోనే పాతుకుపోయాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అతడి తర్వాత క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్) కోహ్లీకి మంచి సహకారం అందించాడు. దీంతో రాజస్థాన్ సంధించిన 173 పరుగుల టార్గెట్‌ను 17.3 ఓవర్లలోనే చేజ్ చేసేసింది బెంగళూరు. ఈ విజయం ఆర్సీబీకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే లేటెస్ట్ సీజన్‌లో సీఎస్‌కేను వాళ్ల సొంతగడ్డ చెన్నైలో ఓడించిన కోహ్లీ టీమ్.. ఆ తర్వాత ఎంఐని ముంబైలో, కేకేఆర్‌ను కోల్‌కతాలో మట్టికరిపించింది. తాజాగా రాజస్థాన్‌ను జైపూర్‌లో చిత్తు చేసింది. కాగా, ధనాధన్ బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేసిన ఫిల్ సాల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఇవీ చదవండి:

ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు..

ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి..

ఢిల్లీ వర్సెస్ ముంబై.. లెక్కలు మారుస్తారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 07:36 PM