Share News

Sourav Ganguly: మళ్లీ గంగూలీనే.. ఐసీసీలో తిరుగులేని దాదాగిరి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:13 AM

ICC: టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐసీసీలో చక్రం తిప్పనున్నాడు. అత్యున్నత క్రికెట్ బోర్డులో ఆయన తాజాగా ఓ కీలక పదవికి నియమితుడయ్యాడు. మరి.. ఏంటా పోస్ట్.. అనేది ఇప్పుడు చూద్దాం..

Sourav Ganguly: మళ్లీ గంగూలీనే.. ఐసీసీలో తిరుగులేని దాదాగిరి
Sourav Ganguly

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ క్రికెట్‌ చైర్మన్‌గా ఇంకోసారి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యాడు. దుబాయ్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా దాదాను మరోమారు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సెలెక్ట్ చేశారు. మరో టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ కమిటీలో మెంబర్‌గా కొనసాగనున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్, ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి హమిద్ హసన్, సౌతాఫ్రికాకు చెందిన బవుమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.


స్పెషల్ టాస్క్‌ఫోర్స్

దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో 2021లో ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అందుకున్నాడు గంగూలీ. ఇప్పుడు మరోసారి ఆ పోస్ట్‌కు ఎంపికయ్యాడు. దాదా మరోసారి ఐసీసీలో కీలక పదవిని దక్కించుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించాలని కోరుతున్నారు. కంగ్రాట్స్ గంగూలీ.. అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, అటు మహిళల క్రికెట్ కమిటీని కేథరిన్ క్యాంప్‌బెల్ ముందుండి నడిపించనున్నారు. ఈ కమిటీలో క్యాంప్‌బెల్‌తో పాటు అవ్రిల్ ఫహే (ఆస్ట్రేలియా)తో పాటు మొసెకి (సౌతాఫ్రికా) కూడా మెంబర్స్‌గా ఉన్నారు. ఇకపోతే, నిన్న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐసీసీ మరో డెసిషన్ తీసుకుంది. ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో చెల్లాచెదురైన ఆ దేశ విమెన్స్ క్రికెటర్స్ కోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ దేశ ప్లేయర్లందర్నీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఈ టాస్క్‌ఫోర్స్‌కు సహకారం అందించనున్నాయి.


ఇవీ చదవండి:

సిక్స్‌ కొడితే రూ.లక్ష

లూకాస్‌ మార్టెన్స్‌ ప్రపంచ రికార్డు

ఐపీఎల్‌లో రోబో డాగ్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 11:23 AM