Share News

SRH vs GT: వరుసగా నాలుగో ఓటమి.. సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:26 AM

SRH Playoff Chances: సన్‌రైజర్స్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓటమి తర్వాత.. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది కమిన్స్ సేన.

SRH vs GT: వరుసగా నాలుగో ఓటమి.. సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..
Sunrisers Hyderabad

ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ టీమ్ పెర్ఫార్మెన్స్ దిగజారుతోంది. సండే ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్ ముందు కూడా సరెండర్ అయిపోయింది ఆరెంజ్ ఆర్మీ. 7 వికెట్ల తేడాతో ఓడి వరుసగా నాలుగో పరాభవాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో కమిన్స్ సేనకు ప్లేఆఫ్స్ చాన్స్ ఉందా.. ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఎన్ని మ్యాచుల్లో నెగ్గాలి.. అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ చాన్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


ఇలా జరిగితేనే క్వాలిఫై..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో 1 గెలుపు, 4 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది. 2 పాయింట్లతో ఉన్న కమిన్స్ సేన.. నెట్ రన్‌రేట్ -1.629గా ఉంది. ఆరెంజ్ ఆర్మీ ఇంకా 9 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7 మ్యాచుల్లో గెలవడం కంపల్సరీ. అప్పుడు 8 విజయాలతో టీమ్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. భారీ తేడాతో కొన్ని విజయాలు సాధిస్తే నెట్‌ రన్‌రేట్ కూడా మైనస్ నుంచి ప్లస్‌లోకి మారుతుంది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్ చాన్సులు ఉంటాయి.


హిస్టరీ ఏం చెబుతోంది..

గత కొన్ని ఐపీఎల్ ఎడిషన్స్‌ను గమనిస్తే.. 14 మ్యాచుల్లో 7 నుంచి 8 విజయాలు సాధించిన జట్లు కూడా టాప్-4లో నిలిచి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. పోయినేడు ఆర్సీబీ 7 విజయాలతో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. కాబట్టి, ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు.. ఇక ముందు జరిగే ప్రతి మ్యాచ్‌లో నెగ్గడం, అదీ మంచి రన్‌రేట్‌తో విజయం సాధించడంపై కాటేరమ్మ కొడుకులు ఫోకస్ పెట్టాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. అయితే ఏడెనిమిది విజయాలు సాధిస్తే.. పక్కా టాప్-4లో చోటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ఎస్‌ఆర్‌హెచ్ ఎంత బాగా ఆడినా, గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చి వరుసగా నెగ్గుతూ పోయినా ప్లేఆఫ్స్ బెర్త్‌పై భరోసా లేదు. ఎందుకంటే మిగతా జట్ల గెలుపోటములను బట్టి కూడా కమిన్స్ సేన తలరాత డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ లెక్కలు పక్కనబెట్టి, ఇప్పటివరకు జరిగినది అంతా మర్చిపోయి.. భారీ విజయాలు సాధించాలనే ఒకే సూత్రంతో ఆడటం బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

రిటైర్మెంట్‌.. ఇప్పుడే కాదు..!

రోహిత్‌తో ఆటను ఆస్వాదిస్తా..: కోహ్లీ

రుద్రాంక్ష్‌కు పసిడి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2025 | 11:20 AM