Heinrich Klaasen: ప్రత్యర్థులకు క్లాసెన్ వార్నింగ్.. కాటేరమ్మ కొడుకును అంటూ..
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:10 PM
IPL 2025: వరుస పరాజయాలతో డీలాపడిన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ మీద సంచలన విజయంతో తిరిగి కోలుకుంది. ఇదే జోష్‌ను ఇతర మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. ఇంతకీ అతడేం చేశాడంటే..

వరుసగా దారుణ ఓటములతో డీలాపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును చూసి అంతా పనైపోయిందని అనుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ 4 పరాభవాలు చూసిన కమిన్స్ సేన.. ఇక కోలుకోవడం అయ్యే పనికాదని డిసైడ్ అయ్యారు. కానీ పడిలేచిన కెరటంలా ఆరెంజ్ ఆర్మీ తాము రేసులోనే ఉన్నామని చాటిచెప్పింది. పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్‌లో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచి విజయగర్జన చేసింది. ఇదే ఊపులో మరిన్ని మ్యాచుల్లో నెగ్గాలని చూస్తోంది ఎస్‌ఆర్‌హెచ్. ఈ తరుణంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇస్తోంది. ఇంతకీ అతడేం చేశాడో ఇప్పుడు చూద్దాం..
కేన్ మామతో మొదలు..
కాటేరమ్మ కొడుకును అంటూ క్లాసెన్ మాస్ డైలాగ్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. కాస్కోండ్రా క్లాసెన్ మీకు నరకం చూపించడం గ్యారెంటీ అంటూ అపోజిషన్ టీమ్స్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ కాటేరమ్మ కొడుకునని తెలియకుండానే ఆ లెవల్‌లో ఆడాడని.. ఇక అర్థం తెలిశాక మరింత రెచ్చిపోవడం ఖాయమని భయపెడుతున్నారు. మొన్న అభిషేక్ సునామీ చూశాం.. నెక్స్ట్ క్లాసెన్ సంభవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సన్‌రైజర్స్‌కు ఆడిన ఆటగాళ్లకు ఇక్కడి అభిమానులు ముద్దుపేర్లు పెడుతుంటారు. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన కేన్ విలియమ్సన్‌కు కేన్ మామ, డేవిడ్ వార్నర్‌కు డేవిడ్ భాయ్ అనే నిక్‌నేమ్స్‌తో పిలుస్తూ వాళ్లపై ప్రేమను కురిపించారు ఫ్యాన్స్. అలాగే క్లాసెన్‌ను కాటేరమ్మ కొడుకు అంటూ పిలుస్తూ వస్తున్నారు.
కాటేరమ్మ కొడుకు తెలుసా..
సన్‌రైజర్స్ టీమ్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌లో క్లాసెన్‌కు ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని ఇక్కడి అభిమానులు ఏమని పిలుస్తారో తెలుసా అని యాంకర్ అడిగింది. దీనికి అతడు తెలియదు అంటూ అడ్డంగా తలూపాడు. దీంతో మిమ్మల్ని కాటేరమ్మ కొడుకు అంటారని యాంకర్ చెప్పింది. ఒకసారి కాటేరమ్మ కొడుకు అనమని యాంకర్ రిక్వెస్ట్ చేయడంతో.. కాస్త సీరియస్‌గా కాటేరమ్మ కొడుకు అన్నాడు క్లాసెన్. ఈ డైలాగ్ వినగానే పక్కనే ఉన్న ఇషాన్ నవ్వుల్లో మునిగిపోయాడు. కాగా, రెబల్‌స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో కాటేరమ్మ సీన్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఆ సీన్‌లో కాటేరమ్మ పేరు చెప్పి విలన్లను ప్రభాస్ ఊచకోత కోయడం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అందుకే గ్రౌండ్‌లో బౌలర్లను చెడుగుడు ఆడే క్లాసెన్‌ను ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని పిలుస్తుంటారు ఫ్యాన్స్.
ఇవీ చదవండి:
ఒలింపిక్స్‌లో క్రికెట్.. క్రేజీ అప్‌డేట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి