SRH vs DC: డీసీకి పట్టపగలే చుక్కలు.. స్టార్లంతా ఔటైనా ఒక్కడే నిలబడి..
ABN, Publish Date - Mar 30 , 2025 | 05:16 PM
Aniket Verma: స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ప్రత్యర్థి జట్లులోని బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ దశలో ఓ కుర్ర బ్యాటర్ తాను ఉన్నానంటూ సన్‌రైజర్స్ కోసం ధైర్యంగా నిలబడి పరుగులు చేశాడు. అతడే అనికేత్ వర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ మీద సన్‌రైజర్స్ చెలరేగిపోతుందని అంతా అనుకున్నారు. 300 కాకపోయినా కనీసం 250 ప్లస్ మార్క్ దాటుతుందని ఆశించారు. కానీ కట్ చేస్తే మన టీమ్ అన్ని ఓవర్లు ఆడటం కూడా కష్టంగా మారింది. విధ్వంసానికి మారుపేరైన కాటేరమ్మ కొడుకులు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఎస్‌ఆర్‌హెచ్. అయితే స్టార్లంతా క్రీజును వీడుతున్నా.. ఓ కుర్ర బ్యాటర్ మాత్రం పట్టుదలతో ఆడాడు. భారీ సిక్సులు బాదుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు పోయించాడు. అతడే అనికేత్ వర్మ.
ఫియర్‌లెస్ బ్యాటింగ్
విశాఖ టీ20లో అనికేత్ 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 5 బౌండరీలు బాదిన యంగ్ బ్యాటర్.. ఏకంగా 6 సిక్సులు కొట్టాడు. 180 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అనికేత్.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా బాదిపారేశాడు. ముఖ్యంగా అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి మరీ సిక్సులు కొట్టాడు. మోహిత్ శర్మ స్లో డెలివరీస్‌ను అంతే తెలివిగా బౌండరీకి తరలించాడు. అతడు ఆఖరి వరకు ఉంటే స్కోరు 200 దాటేది. అనికేత్ బ్యాటింగ్ చూసిన నెటిజన్స్.. సన్‌రైజర్స్‌లో కొత్త హీరో పుట్టుకొచ్చాడని కామెంట్స్ చేస్తున్నాడు. అతడి ఫియర్‌లెస్ అప్రోచ్, సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీస్, ఫైటింగ్ స్పిరిట్ సూపర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అనికేత్ ఇలాగే ఆడితే త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
ఇవీ చదవండి:
నితీష్ రెడ్డికి సరికొత్త చాలెంజ్
ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2025 | 05:16 PM