SRH vs DC Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి సరికొత్త చాలెంజ్.. సొంతగడ్డపై అందరి సమక్షంలో..
ABN, Publish Date - Mar 30 , 2025 | 03:15 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖ తీరాన పోటీపడనుంది ఆరెంజ్ ఆర్మీ. అయితే ఈ మ్యాచ్ మిగతా అందరి కంటే కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకో చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరాటానికి రెడీ అవుతోంది. మొదటి రెండు మ్యాచులు ఉప్పల్‌లో ఆడిన కమిన్స్ సేన.. మూడో మ్యాచ్ కూడా తెలుగు గడ్డ మీదే ఆడనుంది. విశాఖ తీరాన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఒకరకంగా రెండు తెలుగు జట్ల మధ్య జరుగుతున్న సమరమని అనొచ్చు. ఇందులో గెలిచి విన్నింగ్ స్ట్రీక్‌ను మెయింటెయిన్ చేయాలని డీసీ భావిస్తోంది. రెండో పోరులో వచ్చిన తడబాటును అధిగమించి.. తిరిగి గాడిన పడేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ అనుకుంటోంది. అయితే టీమ్స్ కంటే కూడా ఓ ప్లేయర్‌కు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా నిలవనుంది.
దుమ్మురేపాలె
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి వైజాగ్ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగుతున్న నితీష్.. ఈ మ్యాచ్‌లో తప్పక పెర్ఫార్మ్ చేయాలి. ఆంధ్రా క్రికెట్ టీమ్‌కు ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు.. వైజాగ్ సొంతగడ్డ అనేది తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్‌లో కాస్త తడబాటుకు గురవుతున్న నితీష్.. హోమ్ గ్రౌండ్‌లో సొంత అభిమానుల మధ్య అదరగొట్టి సన్‌రైజర్స్‌ను గెలిపించాల్సిన అవసరం ఉంది. సొంత ప్రేక్షకుల మధ్య రాణించడం, మంచి ఇన్నింగ్స్‌తో వాళ్లను ఎంటర్‌టైన్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే అటు టీమ్ కోసం, ఇటు ఆడియెన్స్ కోసం, అలాగే సొంత అభిమానుల కోసం విశాఖ తీరాన సునామీ సృష్టించాల్సిన బాధ్యత నితీష్‌పై ఉంది. మరి.. తెలుగోడు ఏం చేస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2025 | 03:15 PM