Cricket: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:14 PM
Sri Lanka Cricket: 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఓ స్టార్ బ్యాటర్ గుడ్‌బై చెప్పేశాడని తెలుస్తోంది. త్వరలో జరిగే ఓ మ్యాచ్‌తో అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. మరి.. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటానని లంక బోర్డుకు అతడు సమాచారం అందజేశాడట. ఆస్ట్రేలియా జట్టుతో గాలె వేదికగా జరిగే టెస్టే అతడి కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ అని సమాచారం. ఫిబ్రవరి 6వ తేదీన మొదలయ్యే ఈ టెస్ట్ కరుణరత్నేకు మైల్‌స్టోన్ మ్యాచ్ కానుంది. గాలె టెస్ట్ అతడి కెరీర్‌లో 100వది. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన సమయమని కరుణరత్నే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి రిటైర్మెంట్ నిర్ణయంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్తంభంలా నిలబడిపోయాడు!
కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య లాంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు మూలస్తంభంగా నిలిచాడు కరుణరత్నే. పరుగుల వరద పారిస్తూ ఎన్నో మ్యాచుల్లో లంకను గెలిపించాడు. చాలా మ్యాచుల్లో టీమ్‌ను ఓటమి కోరల్లో నుంచి బయటపడేశాడు. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు కరుణరత్నే. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేందుకు అదే కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, కెరీర్‌లో 99 టెస్టులు ఆడిన ఈ బ్యాటర్.. 7172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 50 వన్డేల్లో 1316 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 11 అర్ధశతకాలు ఉన్నాయి. అతడి నిష్క్రమణ లంక క్రికెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ లోటును ఎలా భర్తీ చేస్తారో చూడాలి.
ఇదీ చదవండి:
బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్
ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్
కోహ్లీ కొంపముంచిన బస్ డ్రైవర్.. ఎంత పని చేశావ్ భయ్యా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి