Jaiswal vs Rahane: రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్.. స్టార్ క్రికెటర్ల మధ్య వార్
ABN, Publish Date - Apr 04 , 2025 | 02:45 PM
Indian Premier League: ఒకవైపు ఐపీఎల్ హడావుడిలో అంతా బిజీగా ఉంటే.. మరోవైపు యశస్వి జైస్వాల్ ఇతర విషయాలతో వివాదాల్లో నిలుస్తున్నాడు. తాజాగా బ్యాగ్ లొల్లిలో అతడి పేరు వినిపిస్తోంది. అసలు జైస్వాల్ చుట్టూ ఏం జరుగుతోంది.. కాంట్రవర్సీల్లో అతడు ఎందుకు ఇరుక్కుంటున్నాడో ఇప్పుడు చూద్దాం..

క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. తమ ఫేవరెట్ టీమ్స్, నచ్చిన స్టార్ల ఆట చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. వాళ్లను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నారు ప్లేయర్లు. అయితే రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం తన ఆటతీరుతో కాకుండా మరో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చి టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ అయ్యే స్థాయికి ఎదిగేలా చేసిన డొమెస్టిక్ టీమ్ ముంబైని జైస్వాల్ వీడటం చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్సీ ఆఫర్ రావడంతో ముంబై నుంచి గోవా టీమ్‌కు అతడు షిఫ్ట్ అయ్యాడు. అయితే అతడు జట్టు మారడానికి ఇది మెయిన్ రీజన్ కాదని.. బ్యాగు లొల్లి వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
కిట్ బ్యాగ్‌ను తన్నడంతో..
వచ్చే డొమెస్టిక్ సీజన్ నుంచి గోవా తరఫున బరిలోకి దిగనున్నాడు జైస్వాల్. ఈ మేరకు తనకు ఎన్‌వోసీ ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అతడు దరఖాస్తు చేసుకున్నాడు. సారథ్యం ఆఫర్ చేయడంతో తాను కాదనలేకపోయానని.. గోవాకు షిఫ్ట్ అవుతున్నానని జైస్వాల్ అన్నాడు. టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నానని.. ఆ తర్వాత ఫ్రీ ఉన్న టైమ్‌లో గోవాకు ఆడతానని స్పష్టం చేశాడు. అయితే పైకి కెప్టెన్సీ ఆఫర్ అని చెబుతున్నా.. ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్ అజింక్యా రహానేతో ఉన్న గొడవల కారణంగానే జైస్వాల్ టీమ్ మారాడని సమాచారం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కశ్మీర్ మ్యాచ్ సందర్భంగా రహానె కిట్ బ్యాగ్‌ను జైస్వాల్ తన్నాడని క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఆ ఒక్క ప్రశ్నతో..
టీమ్ విషయంలో నీ నిబద్ధత ఏంటి, కమిట్మెంట్ ఉందా.. లేదా.. అని జైస్వాల్‌ను ముంబై కోచ్ ఓంకార్ సాల్వీ ప్రశ్నించాడట. రహానె ముందే ఈ ప్రశ్న వేయడంతో జైస్వాల్ తట్టుకోలేక కిట్ బ్యాగ్‌ను తన్నాడట. అయితే రహానె-జైస్వాల్‌కు మధ్య గొడవలు ఉన్నాయని చాన్నాళ్లుగా వినిపిస్తోంది. దులీప్ ట్రోఫీ ఫైనల్ సమయంలో సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను కంటిన్యూస్‌గా స్లెడ్జ్ చేశాడు జైస్వాల్. అంపైర్ హెచ్చరించినా వినలేదు. దీంతో వెస్ట్‌జోన్ కెప్టెన్‌గా ఉన్న రహానె జోక్యం చేసుకొని అతడిపై సీరియస్ అయ్యాడు. ఇది జైస్వాల్‌కు రుచించలేదట. మరోవైపు రంజీ ట్రోఫీలో విదర్భతో సెమీస్ మ్యాచ్‌కు ముందే కావాలనే జట్టు నుంచి ఈ యంగ్ బ్యాటర్ బయటకు వచ్చేశాడట. దీనిపై ముంబై సెలెక్టర్లు సీరియస్ అయ్యారట. జైస్వాల్‌తో రహానె, ముంబై అసోసియేషన్, మేనేజ్‌మెంట్, సెలెక్టర్లకు పడకపోవడం.. వాళ్లతో అతడికి సెట్ కాకపోవడంతో టీమ్‌ను వీడటమే మంచిది అనుకొని బయటకు వచ్చేశాడని సమాచారం.
ఇవీ చదవండి:
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
ముంబైపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2025 | 02:51 PM