ఈ వయసులోనూ.. ఇదేం మ్యాజిక్ అన్నా?
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:05 AM
ఈ ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు సోమవారం లఖ్‌నవూ జట్టుపై విజ యం ఎంతో ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన స్టయిల్లో...

ధోనీ త్రోపై నెట్టింట ప్రశంసల జల్లు
లఖ్‌నవూ: ఈ ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు సోమవారం లఖ్‌నవూ జట్టుపై విజ యం ఎంతో ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన స్టయిల్లో చేసిన మ్యాజిక్‌మరోసారి అభిమానులను అలరించింది. లఖ్‌నవూ బ్యాటింగ్ చివరి ఓవర్‌లో అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేసిన తీరు.. వహ్‌వా అనిపించింది. ఆ ఓవర్ రెండో బంతిని బౌలర్ పథిరన వైడ్‌గా వేశాడు. స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న సమద్ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లోకి పరుగుకోసం ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన వికెట్‌కీపర్ ధోనీ.. వికెట్ల వెనకాల నుంచి గ్లోవ్స్‌తోనే బంతిని విసిరి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోని వికెట్లను పడగొట్టాడు. స్టంప్స్‌ను సరిగా చూడకుండానే.. వాటికి మహీ గురిపెట్టిన ఈ అద్భుతమైన ఫీట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ‘43 ఏళ్ల వయసులోనూ ఇదెలా సాధ్యం?.. గ్లోవ్స్ వేసుకొని కూడా అలా ఎలా రనౌట్ చేశావ్ అన్నా..’ అంటూ ధోనీ కీపింగ్ సామర్థ్యంపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.
మహీ మ్యాజిక్‌కు లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అలా ఎలా రనౌట్ చేశావు? అని ధోనీని పంత్ సరదాగా అడిగాడు. ‘వికెట్లను చూశా. అలా విసిరానంతే..! తగిలితే తగులుతుంది.. లేకపోతే లేదు’ అని ధోనీ నవ్వుతూ బదులిచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..