IPL 2025 GT Vs LSG: గుజరాత్ స్పీడుకు బ్రేకులు.. లఖ్‌నవూకు హ్యాట్రిక్
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:51 PM
గుజరాత్‌పై లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. జీటీ నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా ఛేదించి హ్యాట్రిక్ విన్‌ను అందుకుంది.

దూకుడు మీదున్న గుజరాత్ టైటన్స్‌కు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్రేకులు వేసింది. గుజరాత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి జయకేతనం ఎగుర వేసింది. లఖ్‌నవూకు ఇది వరుసగా మూడో విజయం. మార్క్రమ్, పూరన్‌ల అర్ధ సెంచరీలు జట్టును విజయ తీరాలకు చేర్చాయి. తొలి నుంచి లఖ్‌నవూ బ్యాటర్లు నిలకడగా ఆడటంతో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో 186 పరుగులు చేసి జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ మార్‌క్రమ్ ( 31 బంతుల్లో 58 పరుగులు) అద్భుత ప్రారంభాన్ని ఇచ్చాడు. వన్ డౌన్‌గా వచ్చిన నికోలస్ పూరన్ తొలుత నిదానంగా ఆడిన ఆ తరువాత దూకుడు చూపించాడు. 34 బంతుల్లో 61 పరుగులతో జట్టుకు కీలకంగా నిలిచాడు. అయితే, రిషభ్ పంత్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
లఖ్‌నవూ టాస్ గెలవడంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. గిల్, సుదర్శన్‌లు నిలకడగా ఆడుతూ బౌండరీలు రాబట్టారు. ఈ క్రమంలో గిల్ 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, సుదర్శన్ కూడా నిలకడగా ఆడుతూ బౌండరీలు రాబట్టారు. దీంతో, 12 ఓవర్లకు 120 పరుగులతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గుజరాత్ పటిష్ఠ స్థతిలో కనిపించింది. ఆ తరువాత లఖ్‌నవూ స్పిన్నర్‌ల మ్యాజిక్‌తో గుజరాత్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూ చివరకు కేవలం 180 పరుగులకే చేతులెత్తేసింది. శుభ్‌మన్, సుదర్శన్ మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు.
ఇవి కూడా చదవండి:
మరో ఉత్కంఠ మ్యాచ్ షురూ.. టాస్ గెలిచిన పంజాబ్
గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం
బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి