Share News

గుజరాత్‌ ఘనంగా..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:11 AM

సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) తన అద్భుత ఫామ్‌ను చాటుకోగా..

గుజరాత్‌ ఘనంగా..

నేటి మ్యాచ్‌లు

వేదిక విశాఖపట్నం

ఢిల్లీ X హైదరాబాద్‌, రా.3.30 నుంచి

వేదిక: గువాహటి

రాజస్థాన్‌ X చెన్నై రా.7.30 నుంచి

  • సొంత మైదానంలో బోణీ

  • ముంబైకి రెండో ఓటమి

  • సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ

  • కట్టడి చేసిన బౌలర్లు

అహ్మదాబాద్‌: సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) తన అద్భుత ఫామ్‌ను చాటుకోగా.. బౌలింగ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ (2/18), సిరాజ్‌ (2/34) ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో నెగ్గి టైటాన్స్‌ బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. బట్లర్‌ (39), గిల్‌ (38) రాణించారు. హార్దిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. సూర్యకుమార్‌ (48), తిలక్‌ వర్మ (39) మాత్రమే ఆకట్టుకున్నారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ప్రసిద్ధ్‌ నిలిచాడు.


బౌలర్ల హవా: ఈ పిచ్‌పై క్లిష్టమైన ఛేదనకు బరిలోకి దిగిన ముంబై పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆరంభం నుంచే వీరిని టైటాన్స్‌ బౌలర్లు కట్టడి చేశారు. సూర్య, తిలక్‌ మినహా ఎవరూ నిలువలేకపోయారు. తొలి ఓవర్‌లోనే పేసర్‌ సిరాజ్‌ గట్టి ఝలక్‌ ఇచ్చాడు. రెండు వరుస ఫోర్లతో జోరు కనబర్చిన ఓపెనర్‌ రోహిత్‌ (8)ను ఓ అద్భుత బంతికి బౌల్డ్‌ చేశాడు. ఇక వచ్చీ రాగానే తిలక్‌ 4,4,6తో 15 రన్స్‌ రాబట్టినా.. అటు సిరాజ్‌ మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (6)ను సైతం బౌల్డ్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు కేవలం 48/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో తిలక్‌-సూర్య జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. 8వ ఓవర్‌లో తిలక్‌ ఫోర్‌, సూర్య సిక్స్‌తో 15 రన్స్‌ వచ్చాయు. వీరు క్రీజులో ఉన్నంతసేపు ముంబై పోటీలో ఉన్నట్టు కనిపించింది. కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రషీద్‌, సాయికిషోర్‌లతో పాటు పేసర్‌ ప్రసిద్ధ్‌ అద్భుత బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టారు. వీరి ఓవర్లలో భారీ షాట్లు ఆడడం ముంబైకి కష్టమైంది. స్వల్ప వ్యవధిలోనే తిలక్‌, సూర్యలను ప్రసిద్ధ్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 62 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక రాబిన్‌ మిన్జ్‌ (3) రెండో మ్యాచ్‌లోనూ విఫలం కాగా.. కెప్టెన్‌ హార్దిక్‌ (11) సైతం సహజశైలిలో ఆడలేక 17వ ఓవర్‌లో రబాడకు చిక్కాడు. చివర్లో నమన్‌ (18 నాటౌట్‌), శాంట్నర్‌ (18 నాటౌట్‌) వేగం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. అయినా ఆఖరి ఓవర్‌లో 46 పరుగులు అవసరం కావడంతో ముంబై ఓటమి ఖాయమని తేలింది.


సుదర్శన్‌ నిలకడ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ మెరుగ్గా రాణించింది. ఓపెనర్లు గిల్‌, సాయి సుదర్శన్‌ల మెరుపు ఆట కారణంగా తొలి వికెట్‌కు 78 పరుగులు జత చేరాయి. ఆరంభంలో సుదర్శన్‌ వేగం కనబర్చుతూ ఐదో ఓవర్‌లో 4,6,4తో 15 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో గిల్‌ 6,4తో 20 రన్స్‌ రావడంతో పవర్‌ప్లేలో గుజరాత్‌ 66 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాత ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు నెమ్మదించాయి. గిల్‌ను తొమ్మిదో ఓవర్‌లో హార్దిక్‌ అవుట్‌ చేశాడు. అటు సాయి ఆటలోనూ జోరు తగ్గింది. పదో ఓవర్‌లో బట్లర్‌ 6,4తో స్కోరులో కదలిక తెచ్చాడు. అయితే ఊపు మీదున్న బట్లర్‌ను 14వ ఓవర్‌లో స్పిన్నర్‌ ముజీబ్‌ వెనక్కి పంపడంతో రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే సుదర్శన్‌ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మైదానంలో అతడికి వరుసగా నాలుగో ఫిఫ్టీ కావడం విశేషం. ఇక హార్దిక్‌ స్లో బాల్‌కు షారుక్‌ (9) వెనుదిరగగా.. 17వ ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్‌ (18), సుదర్శన్‌ల ఒక్కో సిక్సర్‌తో 19 రన్స్‌ సమకూరాయి. దీంతో జట్టు స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్‌, సుదర్శన్‌ సహా మరో ముగ్గురు అవుటవడంతో గుజరాత్‌ డబుల్‌ సెంచరీ ఫీట్‌ను కొద్దిలో మిస్సయింది.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 63, గిల్‌ (సి) నమన్‌ (బి) హార్దిక్‌ 38, బట్లర్‌ (సి) రికెల్టన్‌ (బి) ముజీబ్‌ 39, షారుక్‌ ఖాన్‌ (సి) తిలక్‌ (బి) హార్దిక్‌ 9, రూథర్‌ఫర్డ్‌ (సి) శాంట్నర్‌ (బి) చాహర్‌ 18, తెవాటియా (రనౌట్‌) 0, రషీద్‌ (సి) హార్దిక్‌ (బి) సత్యనారాయణ రాజు 6, రబాడ (నాటౌట్‌) 7, సాయి కిషోర్‌ (రనౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 196/8; వికెట్ల పతనం: 1-78, 2-129, 3-146, 4-179, 5-179, 6-179, 7-194, 8-196; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-34-1, దీపక్‌ చాహర్‌ 4-0-39-1, ముజీబుర్‌ రెహ్మన్‌ 2-0-28-1, హార్దిక్‌ పాండ్యా 4-0-29-2, శాంట్నర్‌ 3-0-25-0, సత్యనారాయణ రాజు 3-0-40-1.

ముంబై: రోహిత్‌ (బి) సిరాజ్‌ 8, రికెల్టన్‌ (బి) సిరాజ్‌ 6, తిలక్‌ (సి) తెవాటియా (బి) ప్రసిద్ధ్‌ 39, సూర్యకుమార్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 48, రాబిన్‌ మిన్జ్‌ (సి) ఇషాంత్‌ (బి) సాయి కిషోర్‌ 3, హార్దిక్‌ (సి) సిరాజ్‌ (బి) రబాడ 11, నమన్‌ ధిర్‌ (నాటౌట్‌) 18, శాంట్నర్‌ (నాటౌట్‌) 18, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 160/6; వికెట్ల పతనం: 1-8, 2-35, 3-97, 4-108, 5-120, 6-124; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-34-2, రబాడ 4-0-42-1, ఇషాంత్‌ 2-0-17-0, రషీద్‌ 2-0-10-0, సాయి కిషోర్‌ 4-0-37-1, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-18-2.


ఆకట్టుకున్న రాజు

(రాజుకు రోహిత్‌ అభినందన)

ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్న తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ముంబై తరఫున గత మ్యాచ్‌లో ఓ ఓవర్‌ వేసి 13 పరుగులే ఇచ్చిన కాకినాడ పేసర్‌ రాజు.. గుజరాత్‌తో పోరులో మూడు ఓవర్లు వేసి ఓ వికెట్‌ (రషీద్‌) పడగొట్టాడు.

సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63)


2

ఒకే వేదిక (అహ్మదాబాద్‌)లో తక్కువ ఇన్నింగ్స్‌ (20)లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా గిల్‌. క్రిస్‌ గేల్‌ (బెంగళూరు, 19) ముందున్నాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 2 2 0 0 4 2.266

లఖ్‌నవూ 2 1 1 0 2 0.963

గుజరాత్‌ 2 1 1 0 2 0.625

పంజాబ్‌ 1 1 0 0 2 0.550

ఢిల్లీ 1 1 0 0 2 0.371

హైదరాబాద్‌ 2 1 1 0 2 -0.128

కోల్‌కతా 2 1 1 0 2 -0.308

చెన్నై 2 1 1 0 2 -1.013

ముంబై 2 0 2 0 0 -1.163

రాజస్థాన్‌ 2 0 2 0 0 -1.882

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

Updated Date - Mar 30 , 2025 | 04:11 AM