Share News

Asia Badminton Championship: మనోళ్లు మురిపిస్తారా

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:02 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత షట్లర్లపై అంచనాలు నెలకొన్నాయి. పీవీ సింధు, లక్ష్య సేన్‌, ప్రణయ్‌ తదితరులు ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు

Asia Badminton Championship: మనోళ్లు మురిపిస్తారా

బరిలో సింధు, సేన్‌, ప్రణయ్‌

నేటినుంచి బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్

నిన్‌గ్బో (చైనా): ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ప్రధాన టోర్నీలలో భారత షట్లర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో మనోళ్లు ఎలా రాణిస్తారోనన్న ఉత్కంఠ ఏర్పడింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజావత్‌ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోడ్‌, అనుపమా ఉపాధ్యాయ, ఆకర్షీ కశ్యప్‌ తలపడుతున్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ ద్వయం, పురుషుల్లో సాత్విక్‌/చిరాగ్‌ జంట టోర్నమెంట్‌లో పాల్గొనడంలేదు. తొలి రౌండ్‌లో తైపీకి చెందిన లీ చియాతో లక్ష్యసేన్‌ తలపడతాడు. గువాంగ్‌ జు (చైనా)తో ప్రణయ్‌, కంటపాన్‌ (ఇండోనేసియా)తో రజావత్‌, క్వాలిఫయర్‌తో కిరణ్‌ జార్జ్‌ మొదటి రౌండ్‌లో అమీతుమీ తేల్చుకుంటారు. మహిళల సింగిల్స్‌లో...ప్రపంచ 17వ ర్యాంకర్‌ సింధు-ఎస్తేర్‌ నురుమి (ఇండోనేసియా)తో టోర్నీని ప్రారంభిస్తుంది.


ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ ఇంటనాన్‌ను అనుపమ, చైనా షట్లర్‌ ఫాంగ్‌ను మాళవిక, రెండో సీడ్‌ యీ హాన్‌ (చైనా)ను ఆకర్షీ ఢీకొంటారు. మహిళల డబుల్స్‌లో ప్రియ/శ్రుతి జంట-తైపీ జోడీ యున్‌ సంగ్‌/చీన్‌ యుతో తలపడతారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌/రూబన్‌ కుమార్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌/రుత్వికా శివాని, సతీష్‌ కరుణాకరన్‌/ఆద్య, ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 05:05 AM