Share News

IPL 2025, LSG vs KKR: పూరన్, మార్ష్ మాస్ హిట్టింగ్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:11 PM

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు.

IPL 2025, LSG vs KKR: పూరన్, మార్ష్ మాస్ హిట్టింగ్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
Nicholas Pooran, Mitchell Marsh

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్స్‌లతో హోరెత్తించాడు. 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. పూరన్‌కు బంతులు ఎక్కడ వేయాలో తెలియక కోల్‌కతా బౌలర్లు తలలు పట్టుకున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.


తమకే సాధ్యమైన షాట్లను కొడుతూ కోల్‌కతా బౌలర్లను బెంబేలెత్తించారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) రాణించడంతో ల‌ఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది (IPL 2025). ఓపెనర్ మార్‌క్రమ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47)తో మార్ష్ హార్డ్ హిట్టింగ్ ప్రారంభించాడు. మార్‌క్రమ్ అవుటైన తర్వాత మార్ష్ జోరు మరింత పెరిగింది. మార్ష్‌కు నికోలస్ పూరన్ కూడా తోడవడంతో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా పూరన్ సిక్స్‌ల వర్షం కురిపించాడు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. అసలు సిసలైన బ్యాటింగ్ మజాను అందించాడు.


అబ్దుల్ సమద్ (6) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. దీంతో లఖ్‌నవూ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశాడు. ఆండ్రూ రస్సెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి తప్ప మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి, లఖ్‌నవూ నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించాలంటే రహానే, వెంకటేష్ అయ్యర్, నరైన్, డికాక్, రింకూ సింగ్ సత్తా చాటాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 05:17 PM