IPL 2025, LSG vs KKR: చితక్కొట్టిన ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా లఖ్‌నవూ
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:25 PM
ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు శుభారంభం అందించారు.

ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడడంతో ఈ రోజు రెండు మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs LSG) జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు శుభారంభం అందించారు.
తమకే సాధ్యమైన షాట్లను కొడుతూ కోల్‌కతా బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో 10 ఓవర్లకు లఖ్‌నవూ 95 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న ఓపెనర్ మార్‌క్రమ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47)ను కోల్‌కతా బౌలర్ హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) అర్దశతకం సాధించాడు. మరో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు.
ఇంకా, లఖ్‌నవూ లైనప్‌లో రిషభ్ పంత్, బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా 200 పరుగుల మార్కును దాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా, లఖ్‌నవూ రెండేసి విజయాలు సాధించాయి. మరి, మూడో విజయాన్ని ఏజట్టు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..