IPL 2025, PBKS vs KKR: పంజాబ్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:25 PM
పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ రోజు (ఏప్రిల్ 15) ముల్లాన్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ గతేడాది సారథ్యం వహించిన జట్టు, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న టీమ్ తొలిసారి తలపడుతున్నాయి.

ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ రోజు (ఏప్రిల్ 15) న్యూ ఛండీగఢ్‌లో తలపడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గతేడాది సారథ్యం వహించిన జట్టు, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న టీమ్ తొలిసారి తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది (PBKS vs KKR).
పంజాబ్ కింగ్స్ జట్టును అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అయ్యర్ 250 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక, ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. అలాగే ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మిడిలార్డర్‌లో నేహల్ వధేరా కీలక పరుగులు చేస్తున్నాడు. ఇక, స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ మాత్రం ఇంకా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్, ఛాహల్ మాత్రమే రాణించగలుగుతున్నారు.
పంజాబ్ తరహాలోనే కోల్‌కతాకు కూడా కెప్టెన్ అజింక్య రహానేనే కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కూడా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మిడిలార్డర్‌లో వెంకటేష్ అయ్యర్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు చేశాడు. రింకూ సింగ్, రమణ్‌దీప్, రస్సెల్ జట్టును గెలిపించే ప్రదర్శనలు చేయాల్సి ఉంది. ఇక, స్పిన్ విభాగంలో కోల్‌కతా చాలా పటిష్టంగా కనబడుతోంది. నరైన్, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఒమర్జాయ్, మార్కో జాన్సన్, అర్ష్‌దీప్, ఛాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, రమణ్‌దీప్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..