Virat Kohli and Rohit Sharma: రోహిత్‌తో అనుబంధం.. మనసు విప్పి మాట్లాడిన విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:57 PM
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. భారత క్రికెట్‌లో దిగ్గజాలు. దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించిన వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా నిలబడుతున్నారు. ఎన్నో టోర్నీలు గెలిపించారు. వీరిద్దరూ మంచి స్నేహితులని ఒకసారి, వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని మరోసారి వార్తలు వస్తుంటాయి.

విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma).. భారత క్రికెట్‌లో దిగ్గజాలు. దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించిన వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా నిలబడుతున్నారు. ఎన్నో టోర్నీలు గెలిపించారు. వీరిద్దరూ మంచి స్నేహితులని ఒకసారి, వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని మరోసారి వార్తలు వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీరిద్దరూ కలిసి టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించారు. ఆ సమయంలో వీరి మధ్య స్నేహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టార్ ఆటగాళ్లిద్దరూ ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు పాత్రినిధ్యం వహిస్తున్నారు. సోమవారం ముంబైతో జరగబోయే మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. రోహిత్‌తో అనుబంధం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా ఒక వ్యక్తికి కలిసి సాగుతున్నప్పుడు ఇద్దరి మధ్య అంతా సహజంగానే ఉంటుందని తాను భావిస్తున్నాని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
* గేమ్ గురించి మేం ఎంతో చర్చించుకుంటాం. ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటాం. కెరీర్ ఆరంభంలో ఇద్దరికీ ఒకే రకమైన సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. మా కెరీర్లో ఎన్నో జరిగాయి. కెప్టెన్సీ విషయంలో ఇద్దరం కలిసి పని చేశాం. ఒకరిని మరొకరం నమ్మాం. ఆలోచనలు పంచుకున్నాం. కలిసి ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను *అని కోహ్లీ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..