జ్యోతి హ్యాట్రిక్ పసిడి
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:28 AM
స్టార్ స్ర్పింటర్, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో అదరగొట్టింది. వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ పసిడి దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో...

జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు
డెహ్రాడూన్: స్టార్ స్ర్పింటర్, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో అదరగొట్టింది. వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ పసిడి దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి 13.10 సెకన్లలో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2023 క్రీడల్లో తన పేరిటేనున్న 13.22 సెకన్ల రికార్డును జ్యోతి అధిగమించింది. విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల జ్యోతికిది జాతీయ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2022 (గుజరాత్), 2023 (గోవా) టోర్నీల్లోనూ ఆమె పసిడి అందుకుంది. కాగా, ఆదివారం నాటి పోటీల్లో తెలంగాణ రెండు పతకాలు గెలిచింది.
మహిళల 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్‌లో నందిని, నిత్య, సింధు, మైథిలిలతో కూడిన తెలంగాణ బృందం 47.58 సెకన్లలో రేసు ముగించి మూడోస్థానంతో కాంస్య పతకం సాధించింది. ఇక, మహిళల సంప్రదాయ నెట్‌బాల్‌లో తెలంగాణ జట్టు కాంస్యం గెలిచింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన కాంస్యం పోరును తెలంగాణ 42-42 స్కోరుతో టైగా ముగించింది. దీంతో ఇరుజట్లకు కాంస్య పతకం అందజేశారు. ఇక, పురుషుల డెకాథ్లాన్‌లో ఏపీకి చెందిన రోహిత్ రోమన్ పాటిల్ (6753 పాయింట్లు) మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నాడు.
ఇవీ చదవండి:
భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి