గుజరాత్ జోరుకు బ్రేక్
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:07 AM
నికోలస్ పూరన్ (34 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 61) సుడిగాలి ఇన్నింగ్స్‌తో.. గుజరాత్ టైటాన్స్ నాలుగు వరుస విజయాల జోరుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎ్‌సజీ) బ్రేకులు వేసింది. శనివారం జరిగిన ఈ...

6 వికెట్లతో లఖ్‌నవూ విజయం ఫ గిల్, సుదర్శన్ శ్రమ వృథా
లఖ్‌నవూ: నికోలస్ పూరన్ (34 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 61) సుడిగాలి ఇన్నింగ్స్‌తో.. గుజరాత్ టైటాన్స్ నాలుగు వరుస విజయాల జోరుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎ్‌సజీ) బ్రేకులు వేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (60), సాయి సుదర్శన్ (56) హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. శార్దూల్ ఠాకూర్, బిష్ణోయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్‌క్రమ్ (58) కూల్‌గా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ప్రసిద్ధ్ కృష్ణకు 2వికెట్లు దక్కాయి. వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రిషభ్ పంత్ (21) ఓపెనర్‌గా రావడం విశేషం.
అలవోకగా..: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో మార్‌క్రమ్, పంత్ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 68 పరుగులతో అదిరే అరంభాన్నిచ్చారు. పంత్‌ను కృష్ణ అవుట్ చేసినా.. వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడంతో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారింది. దీంతో ఎల్‌ఎ్‌సజీ 114/1తో గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే, మార్‌క్రమ్‌ను కృష్ణ వెనక్కిపంపడంతో.. రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి 5 ఓవర్లలో గెలుపునకు 27 పరుగులు కావల్సి ఉండగా.. హాఫ్ సెంచరీ చేసిన పూరన్‌ను రషీద్ వెనక్కిపంపాడు. మిల్లర్ (7)ను సుందర్ బౌల్డ్ చేశాడు. కానీ, బదోని (28 నాటౌట్), సమద్ (2 నాటౌట్) 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.
ఆరంభం అదిరినా.. : గిల్, సుదర్శన్ అదిరే అర్ధ శతకాలతో పటిష్ట పునాది వేసినా.. మిడిలార్డర్ వైఫల్యంతో గుజరాత్ 180 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. టైటాన్స్ రికార్డు స్కోరు చేస్తుందని భావించారు. కానీ, వరుస ఓవర్లలో సెటిల్డ్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. చివరి 8 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. 13వ ఓవర్ తొలి బంతికి గిల్‌ను అవేశ్ క్యాచవుట్ చేసి.. జట్టుకు బ్రేక్ అందించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సుదర్శన్‌ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చడంతో టైటాన్స్ 122/2తో నిలిచింది. సుందర్ (2)ను బిష్ణోయ్ బౌల్డ్ చేయగా.. బట్లర్ (16)ను రాఠీ వెనక్కిపంపడంతో ఒక్కసారిగా సీన్ మారింది. ఆఖరి ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్ (22), తెవాటియా (0)ను శార్దూల్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు
గుజరాత్: సాయి సుదర్శన్ (సి) పూరన్ (బి) బిష్ణోయ్ 56, గిల్ (సి) మార్‌క్రమ్ (బి) అవేశ్ 60, బట్లర్ (సి) శార్దూల్ (బి) రాఠీ 16, సుందర్ (బి) బిష్ణోయ్ 2, రూథర్‌ఫోర్డ్ (ఎల్బీ) శార్దూల్ 22, షారుక్ ఖాన్ (నాటౌట్) 11, తెవాటియా (సి) మార్‌క్రమ్ (బి) శార్దూల్ 0, రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 180/6; వికెట్ల పతనం: 1-120, 2-122, 3-127, 4-145, 5-176, 6-176; బౌలింగ్: శార్దూల్ 4-0-34-2, ఆకాశ్ దీప్ 3-0-33-0, దిగ్వేష్ రాఠీ 4-0-30-1, అవేశ్ ఖాన్ 4-0-32-1, బిష్ణోయ్ 4-0-36-2, మార్‌క్రమ్ 1-0-15-0.
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (సి) గిల్ (బి) ప్రసిద్ధ్ 58, పంత్ (సి) సుందర్ (బి) ప్రసిద్ధ్ 21, పూరన్ (సి) షారుక్ (బి) రషీద్ 61, ఆయుష్ బదోని (నాటౌట్) 28, మిల్లర్ (బి) సుందర్ 7, సమద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.3 ఓవర్లలో 186/4; వికెట్ల పతనం: 1-65, 2-123, 3-155, 4-174; బౌలింగ్: సిరాజ్ 4-0-50-0, అర్షద్ ఖాన్ 2-0-11-0, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-26-2, రషీద్ 4-0-35-1, వాషింగ్టన్ సుందర్ 4-0-28-1, సాయి కిశోర్ 1.3-0-35-0.
ఇవి కూడా చదవండి:
గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం
బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి