MS Dhoni Retirement: ధోనీ రిటైర్ అవుతున్నాడా.. చెపాక్ స్టేడియంకు వచ్చిన ధోనీ తల్లిదండ్రులు
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:53 PM
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాడా? ప్రస్తుతం చెన్నైలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ ధోనీకి చివరిదా? ఈ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని ధోనీ భావిస్తున్నాడా? కొన్ని ఇండికేషన్స్ చూస్తే అవుననే సమాధానమే వస్తోంది.

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ (IPL 2025) నుంచి కూడా రిటైర్ అవుతున్నాడా? ప్రస్తుతం చెన్నైలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ (DC vs CSK)ధోనీకి చివరిదా? ఈ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని ధోనీ భావిస్తున్నాడా? కొన్ని ఇండికేషన్స్ చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మధ్యలో రెండు సీజన్లు మినహాయించి మొత్తం ఐపీఎల్ అంతా చెన్నై తరుఫున బరిలోకి దిగాడు. చెన్నై అభిమానులు ధోనీని ఎంతోగానో అభిమానిస్తారు (MS Dhoni Retirement).
ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియం (Chepauk stadium)లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ధోనీ తల్లిదండ్రులు చెపాక్ స్టేడియంకు వచ్చారు. ఈ నేపథ్యంలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే చెపాక్ స్టేడియంలోనే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని గతంలోనే ధోనీ ప్రకటించాడు. అలాగే ధోనీ రిటైర్ అయితే అతడిని రీప్లేస్ చేసేందుకు యంగ్ క్రికెటర్ అయిన ఆయుష్ మాత్రేను చెన్నై ప్రత్యేకంగా పిలిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌నే ధోనికి చివరిదని చాలా మంది భావిస్తున్నారు.
తాజా సీజన్‌లో ధోనీ పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు. గత ఏడాది మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ పరిగెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడు. కీపింగ్ చేయగలుగుతున్నా బ్యాటర్‌గా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. కేవలం బౌండరీలు కొట్టేందుకే ఆసక్తి చూపుతున్నాడు. కేవలం చెన్నై అభిమానుల కోసమే ధోనీని చెన్నై టీమ్ ఆడిస్తోంది. అయితే ఆ నిర్ణయం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు ధోనీ కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Rishabh Pant-Sanjeev Goenka: మళ్లీ విఫలమైన పంత్.. లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూడండి
IPL 2025: తీరు మార్చుకోని దిగ్వేష్.. బీసీసీఐ భారీ జరిమానా.. పంత్‌కు కూడా ఫైన్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..