Share News

Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:50 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం పాకిస్తాన్ అభిమానులను కుంగదీస్తోంది. భారత్ చేతిలో ఓటమి పట్ల పాక్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. పాక్ అభిమానులే కాదు.. ఆ దేశ మీడియా కూడా టీమిండియా విజయానికి వక్రభాష్యం చెబుతోంది.

Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
Pak media on TeamIndia victory

ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (Ind vs Pak) టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఆ పరాజయం పాకిస్తాన్ అభిమానులను కుంగదీస్తోంది. భారత్ చేతిలో ఓటమి పట్ల పాక్ ఫ్యాన్స్ (Pak Fans) రగిలిపోతున్నారు. పాక్ అభిమానులే కాదు.. ఆ దేశ మీడియా (Pak Media) కూడా టీమిండియా విజయానికి వక్రభాష్యం చెబుతోంది. తాజాగా డిస్కవర్ పాకిస్తాన్ టీవీ ఛానెల్‌లో టీమిండియా విజయం గురించి జరిగిన చర్చ చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు (Pak media on TeamIndia victory).


డిస్కవర్ పాకిస్తాన్ (Discover Pakistan) టీవీ ఛానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తులు రోహిత్ సేన విజయానికి వింత వింత కారణాలు చెప్పారు. స్టేడియంలో క్షుద్రపూజలు (Black Magic) చేసినందు వల్లే పాకిస్తాన్ ఓడిపోయిందని వింత కారణం చెప్పారు. దుబాయ్ స్టేడియంలో భారత్ 22 మంది పండితుల చేత పూజలు చేయించిందని, ఒక్కో పాక్ ఆటగాడి కోసం ఇద్దరేసి పండితులు క్షుద్రపూజలు చేశారని డిబేట్‌కు వచ్చిన ఓ వ్యక్తి విశ్లేషించాడు. వారి పూజలు పాక్ ఆటగాళ్ల ఫోకస్‌ను దెబ్బతీశాయని, ఈ పూజలు చేయించే వీలు ఉండదనే టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్‌కు రాలేదని తేల్చేశాడు (Champions Trophy).


మరో ప్యానలిస్ట్ మాట్లాడుతూ.. వాళ్లు అంత అద్భుతంగా ఆడడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు. పూజల వల్లే వాళ్లు అంత చక్కగా ఆడి ఉంటారని కామెంట్ చేశారు. మరో ప్యానలిస్ట్ ఇంకో అడుగు ముందుకేసి.. 2011 ప్రపంచకప్ కూడా టీమిండియాకు అలాగే దక్కిందని వ్యాఖ్యానించాడు. 2011 ప్రపంచకప్‌లో భారత్-పాక్ సెమీస్ మ్యాచ్‌కు ముందు ఏడుగురు పండితులు మొహలీ పిచ్‌పై పూజలు చేశారని, అందుకే ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిచిందని కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..


Ind vs Pak: పక్కకెళ్లి ఆడుకోమ్మా.. అబ్రార్‌పై ట్రోలింగ్.. పాకిస్తాన్ ఓటమిపై ట్రెండ్ అవుతున్న మీమ్స్..


Virat Kohli: కోహ్లీ ఇలా చేసుండాల్సింది కాదు.. పాక్ మహిళా అభిమాని ఆవేదన వింటే.. వీడియో వైరల్..!


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 04:45 PM