Pat Cummins Slams Media: నేను టీమిండియాను తప్పుపట్టలేదు: ప్యాట్ కమిన్స్
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:06 AM
ఐసీసీ, టీమిండియాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డాడు. తానెప్పుడూ టీమిండియా, ఐసీసీని తప్పుపట్టలేదని స్పష్టం చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడిన కారణంగా భారత్‌కు అన్యాయంగా ప్రయోజనం కలిగిందని తానెప్పుడూ అనలేదని ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశాడు. తన మాటలను వక్రీకరించారని ఆస్ట్రేలియా మీడియా కోడ్‌క్రికెట్‌పై మండిపడ్డాడు. తానెపుడూ అలా అనలేదని ఎక్స్ వేదికగా స్పందించాడు (Pat Cummins Slams Media).
ప్యా్ట్ కమిన్స్ ఐసీసీని విమర్శించినట్టు కోడ్‌క్రికెట్ మీడియా సంస్థ ఓ పోస్టులో పేర్కొంది. భారత్‌కు తనకు నచ్చిన వేదికలపై ఆడనివ్వడంతో అన్యాయంగా ప్రయోజనం పొందిందని ప్యాట్ అన్నట్టు కోడ్ క్రికెట్ పేర్కొంది. ఈ మేరకు అతడి వ్యాఖ్యలను కోటేషన్స్‌లో కూడా పెట్టి ఓ ఫొటో షేర్ చేసింది. మిగతా టీంలు మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్, దుబాయ్‌ల మధ్య చక్కర్లు కొడుతుంటే భారత్‌కు మాత్రం తన మ్యాచులన్నీ ఒకే వేదికపై ఆడే అవకాశం దక్కిందని కమిన్స్ అన్నట్టు కోడ్ క్రికెట్ పేర్కొంది. ఫలితంగా ఒక్కసారిగా దుమారం రేగింది. ఆ తరువాత కోడ్‌క్రికెట్ ఆ పోస్టును డిలీట్ చేసినప్పటికీ ప్యాట్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మ్యాచ్‌లన్నీ ఒక్కచోటే ఆడిస్తే ఎలా?
ప్యాట్ కమిన్స్ అసలేమన్నాడంటే..
తొలుత కమిన్స్ తన అభిప్రాయాలను యాహూ ఆస్ట్రేలియాతో పంచుకున్నాడు. ‘‘టోర్నీ యథావిధిగా కొనసాగుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. కానీ, అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే వాళ్ల టీం బలంగా ఉంది. దీనికి తోడు అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికగా ఆడటం ప్రయోజనం కలిగిస్తుంది’’ అని కామెంట్ చేశాడు.\
ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్‌తో పాటు దుబాయ్ వేదికగా మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, భద్రతా కారణాల రీత్యా పాక్‌లో టీమిండియా ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో, భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరిగాయి. ఈ నేపథ్యంలో పాట్ కమిన్స్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
AUS vs SA: ఇంగ్లండ్‌ను వదలని శని.. ఇక తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే
కాలి గాయం కారణంగా కమిన్స్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కంగారూలకు సారథిగా ఉన్నాడు. స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై గొప్ప విజయం సాధించింది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి