Share News

ప్రియాన్ష్‌ ఫటాఫట్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:56 AM

యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103) మెరుపు శతకంతో విరుచుకుపడిన వేళ.. పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఇక సీజన్‌లో తొలిసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నా.. ఫినిషింగ్‌లో...

ప్రియాన్ష్‌ ఫటాఫట్‌

ఐపీఎల్‌లో నేడు

గుజరాత్‌ X రాజస్థాన్‌

వేదిక: అహ్మదాబాద్‌, రా.7.30

39 బంతుల్లోనే మెరుపు శతకం

పంజాబ్‌దే విజయం

చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి

చండీగఢ్‌: యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103) మెరుపు శతకంతో విరుచుకుపడిన వేళ.. పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఇక సీజన్‌లో తొలిసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నా.. ఫినిషింగ్‌లో దూకుడు కనబర్చలేకపోయింది. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 18 రన్స్‌ తేడాతో పంజాబ్‌ నెగ్గింది. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. టాప్‌-6లో ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే నిరాశపర్చినా.. ప్రియాన్ష్‌ ఒంటిచేత్తో జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడికి శశాంక్‌ (52 నాటౌట్‌) తోడ్పడగా, ఆఖర్లో జాన్సెన్‌ (34 నాటౌట్‌) రాణించాడు. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు కాన్వే (69 రిటైర్డ్‌ అవుట్‌), రచిన్‌ (36) మెరుపు ఆరంభంతో తొలి వికెట్‌కు 61 రన్స్‌ అందించారు. అయితే మధ్య ఓవర్లలో తడబాటుతో చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. శివమ్‌ దూబే (42) భారీ షాట్లతో ఆకట్టుకున్నా అతను కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది. డెత్‌ ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు సులువుగా పరుగులివ్వలేదు. దీంతో చివరి ఓవర్‌లో 28 రన్స్‌ కావాల్సిన వేళ ధోనీ (27) వెనుదిరగగా, జట్టు 9 పరుగులే చేయగలిగింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ప్రియాన్ష్‌ నిలిచాడు.


ఆర్య అదిరేలా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఓవైపు వికెట్లు పతనమవుతున్నా..మరో వైపు ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య విధ్వంసం కొనసాగింది. తొలి ఎనిమిది ఓవర్లలోనే ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (0), శ్రేయాస్‌ (9), స్టొయినిస్‌ (4), నేహల్‌ (9), మ్యాక్స్‌వెల్‌ (1) ఇలా అంతా సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగినా.. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాని ఆర్య బాదుడు మాత్రం ఆపలేదు. బౌలర్‌ ఎవరైనా చితక్కొడుతూ మైదానం నలువైపులా బౌండరీల వరద పారించాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదిన తను రెండో బంతికే ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను ఖలీల్‌ వదిలేశాడు. దీనికి సీఎ్‌సకే భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆ తర్వాత తన జోరుకు పవర్‌ప్లేలో స్కోరు 75/3కి చేరగా, అటు 19 బంతుల్లోనే ఆర్య ఫిఫ్టీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో శశాంక్‌ నుంచి అతడికి సహకారం అందింది. 13వ ఓవర్‌లో ఆర్య 6,6,6,4తో 23 రన్స్‌ రాబట్టగా.. 39 బంతుల్లోనే తొలి సెంచరీని పూర్తి చేశాడు. లీగ్‌లో ఇది నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం విశేషం. అయితే తర్వాతి ఓవర్‌లోనే అతడిని స్పిన్నర్‌ నూర్‌ అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక చివరి ఐదు ఓవర్లలో శశాంక్‌, జాన్సెన్‌ చెలరేగి 55 పరుగులు అందించడంతో పంజాబ్‌ 200+ స్కోరును అవలీలగా సాధించింది.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ ఆర్య (సి) శంకర్‌ (బి) నూర్‌ 103, ప్రభ్‌సిమ్రన్‌ (బి) ముకేశ్‌ 0, శ్రేయాస్‌ (బి) ఖలీల్‌ 9, స్టొయినిస్‌ (సి) కాన్వే (బి) ఖలీల్‌ 4, నేహల్‌ (సి) ధోనీ (బి) అశ్విన్‌ 9, మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 1, శశాంక్‌ (నాటౌట్‌) 52, జాన్సెన్‌ (నాటౌట్‌) 34, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 219/6; వికెట్ల పతనం: 1-17, 2-32, 3-54, 4-81, 5-83, 6-154; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-45-2, ముకేశ్‌ 2-0-21-1, అశ్విన్‌ 4-0-48-2, జడేజా 3-0-18-0, నూర్‌ అహ్మద్‌ 3-0-32-1, పథిరణ 4-0-52-0.

చెన్నై: రచిన్‌ (స్టంప్డ్‌) ప్రభ్‌సిమ్రన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 36, కాన్వే (రిటైర్డ్‌ అవుట్‌) 69, రుతురాజ్‌ (సి) శశాంక్‌ (బి) ఫెర్గూసన్‌ 1, దూబే (బి) ఫెర్గూసన్‌ 42, ధోనీ (సి) చాహల్‌ (బి) యశ్‌ 27, జడేజా (నాటౌట్‌) 9, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 201/5; వికెట్ల పతనం: 1-61, 2-62, 3-151, 4-171, 5-192; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-39-0, యశ్‌ ఠాకూర్‌ 4-0-39-1, మ్యాక్స్‌వెల్‌ 2-0-11-1, జాన్సెన్‌ 4-0-48-0, ఫెర్గూసన్‌ 4-0-40-2, స్టొయినిస్‌ 1-0-10-0, చాహల్‌ 1-0-9-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

ఢిల్లీ 3 3 0 0 6 1.257

గుజరాత్‌ 4 3 1 0 6 1.031

బెంగళూరు 4 3 1 0 6 1.015

పంజాబ్‌ 4 3 1 0 6 0.289

లఖ్‌నవూ 5 3 2 0 6 0.078

కోల్‌కతా 5 2 3 0 4 -0.056

రాజస్థాన్‌ 4 2 2 0 4 -0.185

ముంబై 5 1 4 0 2 -0.010

చెన్నై 5 1 4 0 2 -0.889

హైదరాబాద్‌ 5 1 4 0 2 -1.629

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 03:56 AM