Share News

Ricky Ponting: ఆ సమయంలో నాకు ఫోన్ చేసిన తొలి వ్యక్తి ద్రవిడ్.. కీలక విషయం బయటపెట్టిన పాంటింగ్

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:04 PM

ద్రవిడ్ కూడా తన కెరీర్‌లో ఒకసారి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 2007లో ద్రవిడ్ పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచాడు. ఆ సమయంలో ద్రవిడ్‌తో తన సంభాషణ గురించి అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్, ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్ అయిన రికీ పాంటింగ్ మాట్లాడాడు.

Ricky Ponting: ఆ సమయంలో నాకు ఫోన్ చేసిన తొలి వ్యక్తి ద్రవిడ్.. కీలక విషయం బయటపెట్టిన పాంటింగ్
Ricky Ponting, Rahul Dravid

భారత్ తరఫున ఆడిన ఉత్తమ బ్యాటర్ల లిస్ట్‌ చూస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ అంటే వెంటనే గుర్తుకొచ్చే ఆటగాడు ద్రవిడ్. అలాంటి ద్రవిడ్ కూడా తన కెరీర్‌లో ఒకసారి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 2007లో ద్రవిడ్ పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచాడు. ఆ సమయంలో ద్రవిడ్‌తో తన సంభాషణ గురించి అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్, ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్ అయిన రికీ పాంటింగ్ (Ricky Ponting) మాట్లాడాడు.


*అప్పటికి ద్రవిడ్ ఎంతో ఉత్తమ క్రికెట్ ఆడాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. కానీ, 2007-08 సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. మేమిద్దరం మైదానంలోనే ప్రత్యర్థులం. బయట మంచి స్నేహితులం. ద్రవిడ్ ఇబ్బంది పడుతున్న సమయంలో అతడితో ఒకసారి మాట్లాడా. బయట ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోకు. నువ్వొక అసాధారణ ప్లేయర్‌వి. నీ ఆటపైనే దృష్టి పెట్టు. కచ్చితంగా చాలా గొప్పగా నీ కెరీర్ ముగిస్తావు అని చెప్పా. ఆ తర్వాత నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో నాకు ఫోన్ చేసిన తొలి వ్యక్తి ద్రవిడ్ * అని పాంటింగ్ చెప్పాడు.


అలాగే రోహిత్, కోహ్లీ గురించి కూడా పాంటింగ్ మాట్లాడాడు. *పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్, కోహ్లీ ఉత్తమ ఆటగాళ్లు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ఒడిదుడుకులను చూస్తున్నారు. టెస్ట్ క్రికెట్ వీరికి క్లిష్టంగా మారింది. వీరిద్దరూ మరికొంత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా అని అన్నాడు. అలాగే ధోనీ రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ఆటకు సంబంధించిన ఏ విషయంలోనూ సలహా అక్కర్లేని ఒకే ఒక్క ఆటగాడు ధోనీ* అని పాంటింగ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2025, MI vs RCB: ముంబైలోకి బుమ్రా ఎంట్రీ.. ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్‌‌పై ఓ లుక్కేద్దాం

Siraj-Rohit: సిరాజ్‌కు రోహిత్ అన్యాయం.. కాక రేపుతున్న కొత్త కాంట్రవర్సీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 05:04 PM