పంజాబ్.. బల్లే బల్లే
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:09 AM
ధనాధన్ ఫార్మాట్‌లో నిజంగా ఇది అద్భుతమే. 200కి పైగా స్కోర్లు చేసినా గెలవడంపై సందేహాలు నెలకొన్న వేళ.. లోస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగించింది. తమ చివరి మ్యాచ్‌లో 245 పరుగులు బాదినా పంజాబ్...

నేటి మ్యాచ్
ఢిల్లీ X రాజస్థాన్
వేదిక : ఢిల్లీ, రా.7.30 నుంచి
స్వల్ప స్కోరును కాపాడుకున్న కింగ్స్
చాహల్ చమక్ జూ కోల్‌కతాకు భంగపాటు
చండీగఢ్: ధనాధన్ ఫార్మాట్‌లో నిజంగా ఇది అద్భుతమే. 200కి పైగా స్కోర్లు చేసినా గెలవడంపై సందేహాలు నెలకొన్న వేళ.. లోస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగించింది. తమ చివరి మ్యాచ్‌లో 245 పరుగులు బాదినా పంజాబ్ కింగ్స్ ఓడిన విషయం తెలిసిందే. కానీ మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 111 రన్స్ మాత్రమే సాధించి.. తమ బౌలర్ల ప్రతిభతో కాపాడుకున్న తీరు మాత్రం ఔరా.. అనిపించక మానదు. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్‌కు ముకుతాడు వేసిన స్పిన్నర్ చాహల్ (4/28) గేమ్‌చేంజర్‌గా నిలిచాడు. చివర్లో రస్సెల్ (17) కాస్త భయపెట్టినా పంజాబ్ 16 పరుగుల తేడాతో అపూర్వ విజయం దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30), ప్రియాన్ష్ ఆర్య (12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 22), శశాంక్ సింగ్ (17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 18) మాత్రమే రాణించారు. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ (37), రహానె (17) ఆకట్టుకున్నారు. జాన్సెన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా చాహల్ నిలిచాడు.
పంజాబ్ మాయ: 112 పరుగుల ఛేదనను కోల్‌కతా సునాయాసంగా ముగిస్తుందనే అంతా భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ చాహల్ కేకేఆర్‌ను బెదరగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వికెట్లను కోల్పోవడంతోనే పంజాబ్ విజయంపై ఆశలు పెరిగాయి. కానీ రఘువంశీ, రహానె నిలకడగా ఆడడంతో కోల్‌కతా గెలుపుపై ఎవరికీ సందేహం కలుగలేదు. ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌండరీలతో ముందుకు సాగారు. అయితే 8వ ఓవర్‌లో రహానెను చాహల్ ఎల్బీ చేయడంతో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. వాస్తవానికి రహానె రివ్యూ కోరుకుంటే ఫలితం అతడికి అనుకూలంగానే వచ్చేది. ఇక ఆ తర్వాత పంజాబ్ బౌలర్ల హవా సాగింది. ధాటిగా ఆడుతున్న రఘువంశీని కూడా చాహల్ అవుట్ చేయగా, వెంకటేశ్ అయ్యర్ (7)ను మాక్స్‌వెల్ ఎల్బీ చేయడంతో కేకేఆర్‌లో వణుకు ఆరంభమైంది. దీనికి తోడు చాహల్ ఒకే ఓవర్‌లో రింకూ (2), రమణ్‌దీప్ (0)లను అవుట్ చేసి ఒక్కసారిగా ఆశలు రెట్టింపు చేశాడు. ఓ దశలో కేకేఆర్ 79/8 స్కోరుతో నిలిచింది. అప్పటికి 42 బంతుల్లో 33 పరుగులు కావాల్సి ఉండగా.. 14వ ఓవర్‌లో రస్సెల్ విరుచుకుపడ్డాడు. అప్పటివరకు మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన చాహల్ ఈ ఓవర్‌లో 6,6,4తో 16 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో కేకేఆర్‌పై ఒత్తిడి తగ్గడంతో పంజాబ్ ఆశలు గల్లంతే అనిపించింది. అయినా పట్టు విడువకుండా 15వ ఓవర్‌లో అర్ష్‌దీప్ మెయిడిన్ వికెట్ తీయగా.. ఆ వెంటనే రస్సెల్‌ను జాన్సెన్ బౌల్డ్ చేయడంతో స్టేడియంలో పంజాబ్ సంబరాలు మిన్నంటాయి.
వికెట్లు టపటపా..: బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు అద్భుతం చేశారు. భారీ స్కోరు ఆలోచనలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు వీరి ధాటికి ఉక్కిరిబిక్కిరైంది. తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 245 రన్స్ సాధించిన కింగ్స్ ఈసారి ఓ దశలో వంద పరుగులకైనా చేరుతుందా? అనిపించింది. మొదట ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య ఆడిన తీరుకు.. ఆ తర్వాత మైదానంలో వికెట్ల జాతరకు సంబంధం లేకుండా పోయింది. ప్రతీ బ్యాటర్ భారీ షాట్లకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నారు. 36 పరుగుల వ్యవఽధిలోనే పంజాబ్ చివరి ఆరు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఎనిమిదో నెంబర్ బ్యాటర్ శశాంక్ సింగ్ (18) కాస్త పోరాడినా అది కూడా కాసేపే అయ్యింది. రెండో ఓవర్‌లో ప్రియాన్ష్ రెండు ఫోర్లతో టచ్‌లోకి రాగా.. తర్వాతి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4,6,4, ఆర్య 4తో పేసర్ వైభవ్ అరోరా 20 పరుగులిచ్చుకున్నాడు. ఆ సమయంలో 3 ఓవర్లలోనే 33 పరుగులతో అత్యంత పటిష్ఠంగా కనిపించిన కింగ్స్ జట్టు ఆ తర్వాత పేకమేడలా కుప్పకూలింది. నాలుగో ఓవర్‌లో ప్రియాన్ష్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (0)ల వికెట్లు పడగొట్టి పేసర్ హర్షిత్ పంజాబ్‌ను తొలి దెబ్బ కొట్టాడు. ఆ వెంటనే ఇన్‌గ్లి్‌స (2)ను వరుణ్ అవుట్ చేయగా.. ఆరో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్సర్లతో ధాటిని కనబర్చాడు. కానీ అదే ఓవర్ ఆరో బంతికి హర్షిత్‌కే ప్రభ్‌సిమ్రన్ చిక్కడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 55/4తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్పిన్నర్లు వరుణ్, సునీల్ నరైన్ చకచకా వికెట్లు తీయడంతో ఓ దశలో 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో శశాంక్-బార్లెట్ (11) మధ్య తొమ్మిదో వికెట్‌కు 23 పరుగులు జత చేరడంతో స్కోరు వంద దాటింది. కానీ 16వ ఓవర్‌లోనే వీరిద్దరూ అవుట్ కావడంతో పంజాబ్ ఆట ముగిసింది.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 22, ప్రభ్‌సిమ్రన్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 30, శ్రేయాస్ అయ్యర్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 0, ఇంగ్లిస్ (బి) వరుణ్ 2, నేహల్ (సి) వెంకటేశ్ (బి) నోకియా 10, మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7, సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4, శశాంక్ (ఎల్బీ) వైభవ్ 18, జాన్సెన్ (బి) నరైన్ 1, బార్ట్‌లెట్ (రనౌట్) 11, అర్ష్‌దీప్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 15.3 ఓవర్లలో 111 ఆలౌట్; వికెట్ల పతనం: 1-39; 2-39, 3-42, 4-54, 5-74, 6-76, 7-80, 8-86, 9-109, 10-111; బౌలింగ్: వైభవ్ అరోరా 2.3-0-26-1, నోకియా 3-0-23-1, హర్షిత్ రాణా 3-0-25-3, వరుణ్ చక్రవర్తి 4-0-21-2, నరైన్ 3-0-14-2.
కోల్‌కతా: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్‌లెట్ 2, నరైన్ (బి) జాన్సెన్ 5, రహానె (ఎల్బీ) చాహల్ 17, రఘువంశీ (సి) బార్ట్‌లెట్ (బి) చాహల్ 37, వెంకటేశ్ అయ్యర్ (ఎల్బీ) మ్యాక్స్‌వెల్ 7, రింకూ సింగ్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) చాహల్ 2, రస్సెల్ (బి) జాన్సెన్ 17, రమణ్‌దీప్ (సి) శ్రేయాస్ (బి) చాహల్ 0, హర్షిత్ (బి) జాన్సెన్ 3, వైభవ్ (సి) ఇంగ్లిస్ (బి) అర్ష్‌దీప్ 0, నోకియా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 15.1 ఓవర్లలో 95 ఆలౌట్; వికెట్ల పతనం: 1-7, 2-7, 3-62, 4-72, 5-74, 6-76, 7-76, 8-79, 9-95, 10-95; బౌలింగ్: జాన్సెన్ 3.1-0-17-3, బార్ట్‌లెట్ 3-0-30-1, అర్ష్‌దీప్ 3-1-11-1, చాహల్ 4-0-28-4, మ్యాక్స్‌వెల్ 2-0-5-1.
1
ఐపీఎల్ చరిత్రలో తక్కువ స్కోరు (111)ను కాపాడుకున్న జట్టుగా పంజాబ్.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 6 4 2 0 8 1.081
ఢిల్లీ 5 4 1 0 8 0.899
బెంగళూరు 6 4 2 0 8 0.672
పంజాబ్ 6 4 2 0 8 0.172
లఖ్‌నవూ 7 4 3 0 8 0.086
కోల్‌కతా 7 3 4 0 6 0.547
ముంబై 6 2 4 0 4 0.104
రాజస్థాన్ 6 2 4 0 4 -0.838
హైదరాబాద్ 6 2 4 0 4 -1.245
చెన్నై 7 2 5 0 4 -1.276
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..