Share News

Sania Mirza: పేరెంట్స్ ఆ విషయం మరవొద్దు.. సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 05 , 2025 | 08:12 PM

టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా స్పోర్ట్స్‌తో పాటు ఇతర విషయాల మీద కూడా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె పిల్లల గురించి మాట్లాడుతూ.. పేరెంట్స్‌కు కీలక సూచనలు చేసింది. ఆ విషయం అస్సలు మరవొద్దని పేర్కొంది.

Sania Mirza: పేరెంట్స్ ఆ విషయం మరవొద్దు.. సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sania Mirza

టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా స్పోర్ట్స్‌తో పాటు ఇతర విషయాల మీద కూడా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె పిల్లల గురించి మాట్లాడుతూ.. పేరెంట్స్‌కు కీలక సూచనలు చేసింది. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సీసా సంస్థ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక అథ్లెట్‌గా, తల్లిగా పిల్లలకు ఏం కావాలి? వాళ్ల భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దాలి? వాళ్ల కోసం ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలి? అనేది అర్థం చేసుకున్నా. సీసాలో పిల్లల కోసం ఆటపాటలతో పాటు ఫిట్‌నెస్, క్రియేటివిటీ లాంటివి ఇక్కడ భాగం చేయడం చాలా నచ్చిందని తెలిపింది.


బంధం మరింత బలోపేతం

పిల్లలతో పాటు పేరెంట్స్‌కు కూడా తాను సమాన గౌరవం ఇస్తానని సానియా మీర్జా పేర్కొంది. సీసా లాంటి చోట్లకు రావడం వల్ల పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పుకొచ్చింది. పిల్లలకు ఆటపాటలతో పాటు ఫిట్‌నెస్ మీద కూడా దృష్టి పెట్టడం నేర్పాలని వ్యాఖ్యానించింది. ఫిట్‌గా ఉంటే చిన్నారుల్లో విశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతుందని వివరించింది. ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించడం, ఆ మూమెంట్‌లో బతకడం అనేవి నేర్చుకుంటారని సానియా తెలిపింది. పిల్లల ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చడంపై పేరెంట్స్ పనిచేయాలని.. తమ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం మీద కూడా ఫోకస్ చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంలో సీసా ఫౌండర్ స్వాతి గునుపతి, మెగా డాటర్, ఈ సంస్థ కో-ఫౌండర్ శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు.


ఇవీ చదవండి:

రోహిత్-కోహ్లీని బలిచేస్తున్నారు.. గంభీర్ తప్పులు కనిపించట్లేదా..

కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..

మాట నిలబెట్టుకున్న కమిన్స్.. చెప్పిందే చేశాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 08:12 PM