Shikhar Dhawan: ప్రియురాలి విషయంలో శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:36 PM
భారతదేశపు గొప్ప వైట్ బాల్ క్రికెటర్లలో ఒకరు శిఖర్ ధావన్. అతని భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న తర్వాత ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా. ఇటీవల దుబాయ్ స్టేడియంలో తనతో కనిపించిన యువతి ఎవరు. ఆ విషయాలపై తాజాగా శిఖర్ క్లారిటీ ఇచ్చాడు.

ఒకప్పుడు టీం ఇండియాలో కీలక ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మాజీ భార్య ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకోవడంతో అనేక మంది అభిమానులు అయ్యో, అని బాధపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం శిఖర్ జీవితంలోకి మరో యువతి ప్రవేశించిందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే శిఖర్ ధావన్ తన వివాహ సమస్యలు ముగిసిన తరువాత మరో యువతితో కనిపించాడు.
ఓ యువతితో
ఆ క్రమంలో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో భాగంగా దుబాయ్ స్టేడియంలో శిఖర్ ఓ యువతితో కనిపించాడు. దీంతో వారి మధ్య రొమాంటిక్ సంబంధం ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె పేరు సోఫీ షైన్, ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి. దీనిపై స్పందించిన శిఖర్ ఆమె తన స్నేహితురాలని, ప్రస్తుతానికి పెళ్లి కాలేదని, నేను ఇప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నానని వెల్లడించారు.
వ్యక్తిగత జీవితం
కానీ తాజాగా టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. ఆ క్రమంలో తన పాత వివాహ జీవితం, తన కొడుకు నుంచి దూరంగా ఉండటం, తన జీవితంలో ఉన్న కొత్త స్నేహితురాలు వంటి అనేక అంశాల గురించి ఇబ్బంది లేకుండా మాట్లాడాడు. గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మౌనంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు, తన మాజీ భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న విషయం గురించి ప్రస్తావించారు. తనను తాను దురదృష్టవంతుడిగా భావించడం లేదన్నారు. తన గత అనుభవాలు జీవితంలో పాఠాలు నేర్పించాయని, అవి నేర్పే క్షణాలని చెప్పుకొచ్చాడు. తనకు కొన్ని మంచి క్షణాలు, కొన్ని చెడు క్షణాలు ఉన్నాయని, దానికి కృతజ్ఞుడనని ఆయన అన్నారు.
ఇక్కడ అన్నీ చెప్పలేను
మళ్ళీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు నేను ఎప్పుడూ ప్రేమిస్తానని అన్నాడు. ఆ అమ్మాయి ఎవరని అడిగినప్పుడు, ఆమె తన కొత్త స్నేహితురాలని చెప్పాడు. కానీ ఆమె పేరు వెల్లడించడానికి నిరాకరించాడు. నేను మీకు ఇక్కడ ప్రతిదీ చెప్పాలా? నేను బౌన్సర్లు బాగా ఆడగలను. తెలివైన వారికి ఒక సూచన సరిపోతుందని సరదాగా జవాబిచ్చాడు.
ఎన్నో ఆటుపోట్లు
శిఖర్, ఆయేషా అక్టోబర్ 2012లో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2014లో ఆమె జోరావర్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆయేషాకు మునుపటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ఆయేషా నుంచి విడిపోయిన తర్వాత, అతను తన కొడుకును కలవలేకపోయాడు. తన కుమారుడిని కలిసేందుకు ప్రయత్నించగా ఆమె నిషేధించడం పట్ల ధావన్ ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు.
ఇవి కూడా చదవండి:
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News