ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shreyas Iyer: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:39 AM

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

చండీగఢ్‌: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈమేరకు జట్టు యాజమాన్యం ఆదివారం అతడి పేరును ప్రకటించింది. గత నవంబరు మెగా వేలంలో శ్రేయా్‌సను అత్యంత భారీ మొత్తం రూ.26.75 కోట్లు వెచ్చించి పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో అతడినే సారథిగా నియమిస్తారని అంచనా వేశారు. 2024లో శ్రేయాస్‌ కెప్టెన్సీలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ గెలిచింది. ‘జట్టు నాపై నమ్మకం ఉంచడాన్ని గౌరవంగా భావిస్తున్నా. కోచ్‌ పాంటింగ్‌తో కలిసి మరోసారి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని అయ్యర్‌ స్పందించాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో శ్రేయాస్‌ ఆ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వారిద్దరి ఆధ్వర్యంలో ఆ సీజన్‌లో ఢిల్లీ టోర్నమెంట్‌ రన్నర్‌పగా నిలిచింది.

Updated Date - Jan 13 , 2025 | 07:11 AM