జాతీయ జట్టులోకి శ్రీచరణి
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:48 AM
ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి జాతీయ మహిళా జట్టుకు ఎంపికైంది. ఈనెలాఖరులో శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు వన్డే సిరీ్‌సలో పాల్గొనే...

ముక్కోణపు సిరీస్‌కు ఎంపికైన తెలుగమ్మాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి జాతీయ మహిళా జట్టుకు ఎంపికైంది. ఈనెలాఖరులో శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు వన్డే సిరీ్‌సలో పాల్గొనే 15 మంది సభ్యుల భారత మహిళల జట్టును మంగళవారం ప్రకటించారు. ఇందులో ఎడమచేతి వాటం స్పిన్నరైన 20 ఏళ్ల శ్రీచరణి చోటు దక్కించుకుంది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి.. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు యువ బౌలర్లు కశ్వీ గౌతమ్, శుచి ఉపాధ్యాయ్ కూడా ఈ సిరీ్‌సతో అరంగేట్రం చేయనున్నారు. తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి జట్టులో చోటు నిలబెట్టుకుంది. ఇక, ఐర్లాండ్‌తో సిరీ్‌సకు విశ్రాంతి తీసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ముక్కోణపు సిరీ్‌సతో తిరిగి జట్టులోకొచ్చింది. ఈనెల 27 నుంచి కొలంబోలో జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంక, భారత్, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి.
జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నిస్, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..