ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: టీమిండియాకు ఎలా ఆడాలి.. బాలుడి ప్రశ్నకు విరాట్ సమాధానం

ABN, Publish Date - Jan 29 , 2025 | 08:16 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఢిల్లీ రంజీ జట్టుతో ఉన్నాడు. ఈ క్రమంలో విరాట్ తన తొలి శిక్షణా సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ బాలుడు తాను ఇండియా తరఫున ఎలా ఆడాలని కోహ్లీని అడిగాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Virat Kohli

ఇండియన్ క్రికెట్ టీం బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఢిల్లీ రంజీ జట్టుతో ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత దేశవాళీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న కోహ్లీ, జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో 36 ఏళ్ల కోహ్లీ తన తొలి శిక్షణా సెషన్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణా సెషన్‌లో సహచర క్రికెటర్లలో ఒకరైన ఓ బాలుడు కబీర్‌తో కోహ్లీ మాట్లాడారు. ఆ క్రమంలో ఈ యువ క్రికెటర్ తాను అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున క్రికెట్ ఆడేందుకు ఏం చేయాలని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


విరాట్ సమాధానం..

కబీర్, కోహ్లీని "అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడానికి నేను ఏమి చేయాలి?" అని అడిగాడు. బాలుడి ప్రశ్నకు కోహ్లీ మంచి సలహా ఇచ్చారు. మీరు చాలా కష్టపడి పనిచేయాలి. మీ తండ్రి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పకూడదు. ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్‌కు వెళ్లాలని మీరు చెప్పాలి. ఆ విధంగా మీరు ముందుకు సాగాలని విరాట్ సూచించారు. ఎవరైనా ఒక గంట పాటు ప్రాక్టీస్ చేస్తే, మీరు రెండు గంటలు చేయాలన్నారు. మీరు ప్రతి దాన్ని కష్టపడి చేయాలన్నారు. ఆ క్రమంలో ఎవరైనా 50 పరుగులు చేస్తే, మీరు 100 పరుగులు చేసే సత్తా కల్గి ఉంటారని కోహ్లీ పేర్కొన్నారు.


విరాట్ గేమ్ ఎలా ఉందంటే..

ఇక విరాట్ కోహ్లీ గేమ్ విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా బ్యాటింగ్‌లో కొంత ఇబ్బంది పడుతున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ వరుసగా తక్కువ స్కోర్లు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టులో సెంచరీ సాధించినప్పటికీ, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మొత్తం 100 పరుగులు కూడా చేయలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో 3-1 తేడాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత బీసీసీఐ రంజీ ట్రోఫీలో ఆడడానికి కోహ్లీ అంగీకరించారు. గత వారం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఇతర అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ముంబై తరపున మైదానంలోకి వచ్చారు.


గత ఆటగాళ్లు కూడా..

ఇటీవల శుభ్‌మాన్ గిల్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీ తరపున బరిలోకి దిగారు. రవీంద్ర జడేజా కూడా సౌరాష్ట్ర తరపున తిరిగి వచ్చి, గత రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 12 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ ద్వారా దేశవ్యాప్తంగా ఆడే ఆటగాళ్లకు ఇది మంచి చాంపియన్‌షిప్ అవకాశాలను ఇస్తుందని చెప్పవచ్చు. అనేక మంది ఆటగాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవారే ఉంటారు.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ స్పందన


RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో..


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 08:19 AM