IPL 2025: ఐపీఎల్ కోసం హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లి..

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:39 PM

ఐపీఎల్ 2025 సందర్భంగా విరాట్ కోహ్లి తన లుక్‌లో మార్పులు చేశారు. కొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరించడానికి సిద్దమయ్యారు. కోహ్లి కొత్త హెయిర్ స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లి కొత్త హెయిర్ స్టైల్ చూసి ఫ్యాన్స్ వ్వావ్ అంటున్నారు.

IPL 2025: ఐపీఎల్ కోసం హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లి..
Virat Kohli

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్లంతా మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆర్‌సీబీ ఆటగాడు కోహ్లీ ఆటతో పాటు వ్యక్తిగత లుక్‌పై కూడా దృష్టి సారించారు. అందుకే.. తన లుక్‌లో మార్పులు తీసుకొచ్చారు. కొత్త హెయిర్ కట్ చేయించుకున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హలిమ్ హకిమ్ కోహ్లికి హెయిర్ కట్ చేశారు. ఈ హెయిర్ కట్‌లో కోహ్లి చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హలిమ్ హకిమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కోహ్లి కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కింగ్ కోహ్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు.


వివాదంలో కోహ్లి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సందర్భంగా 14 ఏళ్ల బాలిక ప్రియాంశి చనిపోయింది. కుటుంబంతో కలిసి మ్యాచ్ చూస్తున్న బాలిక గుండె పోటుకు గురై ఇంట్లోనే కన్నుమూసింది. కోహ్లి అవుట్ కావడం వల్లే ప్రియాంశి చనిపోయిందని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. కోహ్లి అవుట్ అవ్వడం వల్ల మనస్తాపానికి గురైన బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని రాశాయి. ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మీడియాలో వస్తున్న వార్తలపై ప్రియాంశి తండ్రి అజయ్ స్పందించాడు. ‘ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా నా కూతురు ఆస్వాధిస్తూ ఆటను చూసింది. ఇండియా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టిన కొద్ది సేపటికే తను కుప్పకూలిపోయింది. అప్పుడు నేను ఇంట్లో లేను.విషయం తెలియగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాను.


అప్పటికే తను చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. నా కుమార్తె గుండెపోటుకు గురై చనిపోయింది. అది విరాట్ కోహ్లి వల్ల మాత్రం కాదు. ఆయన వికెట్ పడటం వల్ల కాదు. నా కూతురు చనిపోయినపుడు కోహ్లి బ్యాటింగ్‌కు కూడా రాలేదు. నేను ఇంట్లో లేనపుడు ఈ సంఘటన జరిగింది. అదంతా యాధృచ్ఛికంగా జరిగింది’ అని స్పష్టం చేశాడు. ఇక, సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు రెండుగా చీలి దీనిపై గొడవపడుతున్నారు. ప్రియాంశి మరణానికి కోహ్లి బాధ్యత వహించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. సంబంధం లేని విషయంలోకి కోహ్లిని ఎందుకు లాగుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ గొడవలు ప్రియాంశి మరణంతో బాధలో ఉన్న కుటుంబాన్ని మరింత బాధపెడుతున్నాయి.


కోహ్లీ హెయిర్ స్టైల్ ఫోటోలను కింద చూడొచ్చు..


ఇవీ చదవండి:

రోహిత్‌పై ధోనీకి ఎందుకంత కోపం

సీఎస్‌కే క్రేజీ రికార్డ్

అబిద్‌ అలీ కన్నుమూత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 06:02 PM