Share News

కంకషన్‌తో కెరీర్‌ ముగింపు

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:41 AM

ఆస్ట్రేలియా క్రికెటర్‌ 27 ఏళ్ల విల్‌ పకోవ్‌స్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో ఒకే టెస్టు ఆడిన ఈ ఆటగాడి నిర్ణయం వెనుక...

కంకషన్‌తో కెరీర్‌ ముగింపు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ 27 ఏళ్ల విల్‌ పకోవ్‌స్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో ఒకే టెస్టు ఆడిన ఈ ఆటగాడి నిర్ణయం వెనుక కంకషన్‌ తదనంతర పరిణామాలే కారణం కావడం గమనార్హం. గతేడాది మార్చిలో జరిగిన షెఫీల్డ్‌ షీల్డ్‌ మ్యాచ్‌లో పేసర్‌ మెరిడిత్‌ షార్ట్‌ పిచ్‌ బాల్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఆ వెంటనే తను మైదానం వీడాడు. అతని కెరీర్‌లో మొత్తంగా 12 సార్లు కంకషన్‌ గాయాలయ్యాయి. స్వతంత్ర మెడికల్‌ ప్యానెల్‌ సూచన ప్రకారం పకోవ్‌స్కీ ఆట నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే దెబ్బతిన్న తన మెదడును మరింత గాయాలపాలు చేయదల్చుకోలేదని పకోవ్‌స్కీ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 03:41 AM