ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTechnology : జిరాక్స్ షాప్‌కెళ్తే ఇలా చేస్తున్నారా.. అంటే కోరి చిక్కుల్లో పడ్డట్టే లెక్క..

ABN, Publish Date - Jan 04 , 2025 | 02:16 PM

ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, అకౌంట్ తెరవడానికో, లోన్ కోసమో బ్యాంక్‍కి వెళ్లినా, ఆధార్ సహా ఏదొక డాక్యుమెంట్ల కాపీలు అవసరం పడతాయి. అందుకోసం చుట్టుపట్ల ఏ జిరాక్స్ షాప్ కనిపించినా అక్కడికి వెళ్లిపోతుంటాం. ఇదంతా మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ, జిరాక్స్ షాప్‌కెళ్లినపుడు.. ఈ తప్పు చేస్తే చాలా డేంజర్

Xerox Centre

ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, అకౌంట్ తెరవడానికో, లోన్ కోసమో బ్యాంక్‍కి వెళ్లినా, హోటళ్లో రూం బుక్ చేయాలన్నా, ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు పొందాలన్నా ఇంకా హాస్పిటల్స్, లైసెన్స్ ఇలా ఎక్కడికెళ్లినా ఆధార్ సహా ఏదొక డాక్యుమెంట్ల కాపీలు అవసరం పడతాయి. అందుకోసం చుట్టుపట్ల ఏ జిరాక్స్ షాప్ కనిపించినా అక్కడికి వెళ్లి ఏ మాత్రం ఆలోచించకుండా హడావుడిగా మన డాక్యుమెంట్లు వాళ్ల చేతుల్లో పెట్టేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎక్కువమంది ఒరిజినల్ ఆధార్ కార్డులు ఇచ్చి ప్రింట్ ఇవ్వమని అడుగుతుంటారు. లేదా మొబైల్‌లో సేవ్ చేసుకున్న పీడీఎఫ్ ఫైల్ వాళ్లు చెప్పిన ఈ-మెయిల్ లేదా వాట్సాప్ నెంబర్‌కు నిస్సంకోచంగా షేర్ చేస్తుంటాం. ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, ఇంటి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, పాస్ పోర్టులు, స్టడీ సర్టిఫికేట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇలా ప్రతిదీ ప్రింట్ తీయించుకోవడం అందరికీ అలవాటే. ఇదంతా మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ, మనం వ్యక్తిగత డేటాను వేరొకరికి చేతులారా అందిస్తున్నాం అనే విషయమే అసలు సమస్యకు కారణం. అవగాహనా లేమితో మనం చేసే పని ఒక పెద్ద స్కాంకు దారితీస్తుందని ఎంతమందికి తెలుసు..


జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి డాక్యుమెంట్లు, అప్లికేషన్లు ప్రింట్ తీసుకోవడం తప్పు కాదు. జిరాక్స్ తీసుకునే విధానంలోనే ప్రమాదం పొంచి ఉంది. ఒరిజినల్ ఆధార్ కార్డు ఇచ్చి జిరాక్స్ తీయించుకోవడం అందరికీ అలవాటే. కానీ, షాపు వాళ్లు అదనంగా కాపీ తీస్తున్నారా అనేది ఎంత మంది గమనిస్తారు. ఇక అవసరం వచ్చినప్పుడు పనికొస్తాయని అత్యవసర డాక్యుమెంట్లు పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో ఫోన్‌లో సేవ్ చేసుకుంటూ ఉంటాం. జిరాక్స్ సెంటర్ వాళ్లకి షేర్ చేసినప్పుడు ప్రింట్ తీశాక డిలీట్ చేశారా అని పట్టించుకోం. మన దారిన మనం వెళ్లిపోతుంటాం. ఇక్కడే ఒక స్కాంకు బీజం పడుతుంది.


రద్దీ ప్రదేశాలకు దగ్గరగా ఉండే జిరాక్స్ షాపుల్లో రోజూ కొన్ని వందల మంది ఆధార్ కార్డ్‌లు, పాన్‌కార్డ్‌లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఫొటోలు వంటివి ప్రింటు తీయించుకుంటూ ఉంటారు. తమ డాక్యుమెంట్ల కాపీలు వాళ్ల దగ్గర ఉన్నాయేమో అని చెక్ చేసుకునేవారు తక్కువే. చాలా చోట్ల ఇలా పోగుపడిన ఐడెంటీటీ కాపీలను డేటా కలెక్షన్ ఏజెంట్లకు అమ్మేస్తుంటారు. ఈ డేటా సాయంతో మనకు తెలియకుండానే మన పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి మనీ యాప్స్, లోన్ యాప్స్, కాల్‌మనీల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బు లావాదేవీలు చేస్తారు. సిమ్‌కార్డులు తీసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాల్ సెంటర్లలో వాడే సిమ్‌కార్డులలో చాలావరకూ ఇలాంటివే. ఎందుకంటే, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కేవలం ఆధార్ కార్డ్ ఉంటే చాలు. చిటికెలో ఇంట్లోనే కూర్చుని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈజీగా సిమ్‌కార్డులు పొందవచ్చు.


దదేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్కాంకు అడ్డుకట్ట వేయటం చాలా సులభం. అడిగిన వెంటనే జిరాక్స్ సెంటర్ వాళ్లకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపవద్దు. అవసరమయ్యే డాక్యుమెంట్లను ప్రతిరోజూ మనం వెంట తీసుకెళ్లలేం కాబట్టి ఒక పెన్‌డ్రైవ్‌లో అవసరమైన డాక్యుమెంట్లన్నీ సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. పర్స్, బైక్ లేదా బ్యాగులో పెట్టుకుంటే అలాగే ఉండిపోతుంది. పెన్‌డ్రైవ్‌లో డాక్యుమెంట్లు ఇతరులు కాపీ చేసుకునేందుకు వీలు లేకుండా లాక్ చేసుకోండి. జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి ప్రింటు ఇవ్వమని అడిగినపుడు మన డాక్యుమెంట్లు ఎక్స్‌ట్రా కాపీలు తీసుకుంటున్నారేమో జాగ్రత్తగా గమనిస్తే చాలు. మీ వ్యక్తిగత డేటా ఇతరుల చేతుల్లో పడకుండా సురక్షితంగా ఉంటుంది.

Updated Date - Jan 04 , 2025 | 02:16 PM