ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

iPhone Offer: రూ. 4,500కే ఐఫోన్.. ఎలాగో తెలుసా?

ABN, Publish Date - Jan 12 , 2025 | 02:29 PM

మీరు తక్కువ ధరల్లో ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకు క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్‌ను ఇప్పుడు రూ. 4,500కే కొనుగోలు చేయవచ్చు.

iPhone offer sale

మీరు మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఆండ్రాయిడ్ మాత్రమే కాదు, ఐఫోన్ (iPhone) కూడా మీ బడ్జెట్‌ ధరల్లో వచ్చే ఛాన్సుంది. గత కొన్ని నెలలుగా, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు పలు అద్భుతమైన డీల్స్, ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా మీరు ఐఫోన్ 12 ప్రముఖ ఐఫోన్ మోడల్‌ను ఇప్పుడు రూ. 4,500కే పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే. అయితే అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


నెలకు ఎంత చెల్లించాలంటే..

అయితే ఐఫోన్ 12 అద్భుతమైన డీల్ కోసం మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త ఐఫోన్ 256GB వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. గతంలో ఐఫోన్ 12 256GB మోడల్‌ను మీరు రూ. 64,900 వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు ఈ మోడల్‌ను కేవలం రూ. 4,500కి పొందే అవకాశం ఉంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తుంది. దీంతో మీరు నెలకు కేవలం రూ. 2,282 చెల్లించి ఈ ఫోన్ తీసుకోవచ్చు.


ఈ డీల్ నిజమేనా..

ఈ డీల్ విషయంలో ప్రధాన అంశం ఏంటంటే మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం. మీరు ఉపయోగిస్తున్న పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, అది ఆఫర్ ధరను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఎక్స్ఛేంజ్ చేసే పరికరానికి అనుసారంగా ఆఫర్ ధరను కస్టమైజ్ చేస్తారు. ఉదాహరణకు మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే, మీరు పెద్ద మొత్తంలో డిస్కౌంట్ పొందుతారు. దీంతోపాటు మరికొన్ని ఇతర డిస్కౌంట్‌లు కూడా మీకు లభిస్తాయి.


ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే. HDR10 సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్

ప్రాసెసర్: Apple A14 Bionic చిప్‌సెట్, 5nm నానో టెక్నాలజీ. ఇది ప్రస్తుత ట్రెండ్‌లో అత్యంత శక్తివంతమైన చిప్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది

RAM & స్టోరేజ్: 4GB RAM, 64GB, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి

కెమెరా: డ్యూయల్ 12MP (ప్రధాన + వైడ్) కెమెరా సిస్టమ్, 12MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: సులభంగా ఒక రోజు పాటు ఉపయోగపడే బ్యాటరీ


EMI ఆప్షన్స్:

ఈ క్రమంలో మీరు నెలకు రూ. 2,282 చెల్లించి ఈ ఐఫోన్ 12, 256GB మోడల్‌ను పొందవచ్చు. ఇది ఐఫోన్ 12ని మీ బడ్జెట్‌లో పొందడానికి ఒక గొప్ప అవకాశం. ఈ EMI ఆప్షన్‌తో మీరు ఫోన్ కొనుగోలు చేయడం మరింత సులభమవుతుంది.

iPhone 12 vs iPhone 13:

కొన్ని సంవత్సరాల క్రితం ఐఫోన్ 12 విడుదలయ్యింది. అయితే ఇప్పుడు ఐఫోన్ 13 కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12, ఐఫోన్ 13లో ప్రధాన వ్యత్యాసం A14 Bionic, A15 Bionic చిప్‌ల మధ్య ఉంది. A15 చిప్ స్పీడ్ పరంగా కొంచెం మెరుగైనదిగా ఉంటుంది. కానీ ఐఫోన్ 12 ఇప్పటికీ చాలా శక్తివంతమైన డివైస్. ఐఫోన్ 12ని తీసుకోవడం ఇప్పుడు ఇంకా ఉత్తమ ఎంపికగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో అద్భుతమైన పనితీరును మీకు అందిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 12 , 2025 | 02:31 PM