ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల ఆందోళన

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:01 PM

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్‌ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తోంది.

బెల్లంపల్లి, జనవరి 7(ఆంరఽధజ్యోతి): బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్‌ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణి యాజమాన్యం దాదాపు 4 వేలకు పైగా క్వార్టర్లను ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ప్రభుత్వం ఎన్నో ఏండ్లు నివాసముంటున్న కార్మికులకు ఇండ్ల పట్టాలను అందించింది. అప్పటి నుంచి సింగరేణి సంస్థ క్వార్టర్లకు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. సింగరేణి కనెక్షన్లను తొలగిస్తామని కార్మికులకు నెల రోజుల గడువు ఇచ్చింది.

కొన్ని క్వార్టర్లలో ప్రభుత్వ విద్యుత్‌ కనెక్షన్‌ ఉండగా మరి కొన్ని క్వార్టర్లలో సింగరేణి విద్యుత్‌ మీదనే ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయి. టేకులబస్తి, కన్నాలబస్తితో పాటు వివిధ వార్డుల్లో సింగరేణి, ఎలక్రిషియన్‌ అధికారులు తిరుగుతూ రిటైర్డు కార్మికుల క్వార్టర్లలో విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తున్నారు. దీంతో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న క్వార్టర్లలో సింగరే ణి యాజమాన్యం విద్యుత్‌ నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రతీ ఇంటికి 200 యూనిట్లు విద్యుత్‌ అందిస్తుందని, అలాగే సింగరేణి యాజమాన్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే యాజమాన్యంతో మాట్లాడి విద్యుత్‌ను పునరుద్ధరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2025 | 11:01 PM