వేలాలలో గిరి ప్రదక్షిణ
ABN, Publish Date - Jan 13 , 2025 | 10:44 PM
వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
జైపూర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మంచి ర్యాల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో వివిధ ప్రాం తాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీరామ పాదుకలతో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. భక్తుల శివనామస్మరణతో గుట్ట పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Updated Date - Jan 13 , 2025 | 10:45 PM