ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు...

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:08 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మంచిర్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన చలి, విపరీతమైన మంచు కారణంగా ధాన్యాన్ని రైతులు మళ్లీ మళ్లీ ఆరబోయాల్సి రావడంతో కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగింది. రైతులు తెస్తున్న ధాన్యంలో తేమ 17 నుంచి 24 శాతం వరకు ఉండగా, 14 నుంచి 17 శాతం లోపే ఉండాలని కొనుగోలు కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. దాంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కల్లాల్లోనే ధాన్యం ఆరబోస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నిబంధనలు కఠినంగా ఉండటంతో కొందరు రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించి విక్రయాలు జరిపారు.

ప్రైవేటు వైపు మళ్లినా...

తేమ పేరుతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది ధాన్యాన్ని తిప్పి పంపుతుండటం, వాతావరణ మార్పుల నేపథ్యంలో నష్టాల నుంచి గట్టేందుకు రైతులు ప్రైవేటు మార్కెట్‌ వైపు మొగ్గు చూపారు. అయినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు వ్యాపారులు తేమ శాతంలో వెసలుబాటు కల్పిస్తుండడం, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కొంచెం అటుఇటుగా ప్రైవేటులోనూ లభిస్తుం డటంతో కొందరు రైతులు బయట మార్కెట్‌లో ధాన్యం విక్రయించారు. బయట మార్కెట్‌లో తేమ 25 నుంచి 30 శాతంపైగా ఉండటంతో తూకాల్లో కలిసి వస్తుందని, తేమశాతం తగ్గేవరకు ఉంటే నష్టపోతామన్న ఆలోచ నతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు తెలుస్తోంది. సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించింది. కొందరు రైతులు ప్రైవే టు మార్కెట్‌ను ఆశ్రయించినా కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అధికారుల అంచనాను దాటి విక్రయాలు నమోదయ్యాయి.

తుది దశకు కొనుగోళ్లు....

వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు దాదాపు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. జిల్లాలో 1,60,605 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సీజన్‌లో 3,68,140 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో ప్రైవేటులో అమ్మకాలు, పంట నష్టాలు పోను కనీసం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ధాన్యం రాబడి అంచనాను బట్టి 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటి వరకు 90వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 259 కేంద్రాల పరిధిలో కొనుగోళ్లు పూర్తికావడంతో ఆయా సెంటర్లను అధికారులు మూసివేశారు.

రైతుల ఖాతాల్లో నగదు జమ....

ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు నగదు చెల్లింపులు జరిగాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 319 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 90వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు పూర్తికాగా ధాన్యానికి సంబంధించి 9,667 మంది రైతులకు రూ.123.24 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన నగదును త్వరలో పూర్తి చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి కోతలు దాదాపుగా చివరి దశకు చేరుకోగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే సుమారు 30వేల మెట్రిక్‌ టన్నులను కూడా త్వరితగతిన కొను గోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:08 PM