దేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద
ABN, Publish Date - Jan 12 , 2025 | 10:56 PM
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి) : దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం లో స్వామి వివేకానంద జయంతి నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివా ళులర్పించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు జ్ఞాపికలు అందించారు. వెంక టేశ్వర్లు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌వెరబెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజ్‌కుమార్, రజనీష్‌జైన్, పురుషోత్తం, ఆంజనేయులు, శ్రీదేవి, సతీష్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు అబ్దుల్ రహీం, ప్రేమ్‌కుమార్‌లను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు సన్మానించారు. కార్యక్రమంలో తిరుపతి, రాజేష్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫిట్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహానికి ఫిట్‌నెస్ సెంటర్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటర్ అధ్యక్షుడు దాసరి కుమార్, నాయకులు ఆంజనేయులు, రామన్న, చంద్రకాంత్, అశోక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 10:56 PM