రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:08 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రాజారమేష్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.
మందమర్రిరూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రాజారమేష్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ. 12 వేలు ప్రకటించడం రైతులను మోసం చేయడ మేనన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. నాయకులు వేల్పుల రవి, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, లౌడం రాజ్‌కుమార్, సోదరి పున్నం, ఫిరోజ్, రాములు, వాలా రవీందర్‌రావు, కొట్రంగి రాజలింగు, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 11:08 PM