Share News

మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:24 PM

బహుజనుల రా జ్యాధికారం కోసం పోరాడిన మహానీయుడు సర్దార్‌ సర్వాయి పాప న్నగౌడ్‌ అని, మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి
పాపన్నగౌడ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అధికారులు

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- జిల్లా వ్యాప్తంగా సర్ధార్‌ పాపన్నగౌడ్‌కు ఘన నివాళి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): బహుజనుల రా జ్యాధికారం కోసం పోరాడిన మహానీయుడు సర్దార్‌ సర్వాయి పాప న్నగౌడ్‌ అని, మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతిని నిర్వహించగా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, జిల్లా వెన కబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తంలతో కలిసి కలెక్టర్‌ హాజరై పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన మహానీయుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అన్నారు. కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్‌ రావు, రవీందర్‌రెడ్డి, రాజేశ్వరి, దుర్గా ప్రసాద్‌, కల్పన, సంఘం నాయకులు పాల్గొన్నారు.

జన్నారం(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జరిగిన సర్ధార్‌ సర్వా యి పాపన్నగౌడ్‌ వర్ధంతి కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు మూల భాస్కర్‌గౌడ్‌, మోకుదెబ్బ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, అంబేద్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు భరత్‌కు మార్‌, ఇందయ్య, చంద్రయ్య,నర్సయ్య, శంకర్‌, సత్తన్న పాల్గొన్నారు.

దండేపల్లి(ఆంధ్రజ్యోతి): సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని గౌడ సంఘం మండల అధ్యక్షుడు బండి రవిగౌడ్‌ అన్నారు. దండేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్‌, లక్ష్మీనారాయణ, రమేష్‌, శ్రీనివాస్‌, కు మారస్వామి, సత్యాగౌడ్‌, తిరుపతి, చంద్రగౌడ్‌, మల్లగౌడ్‌ తది తరులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌(ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు నోముల ఉపేందర్‌ గౌడ్‌, మడి పెల్లి వెంకటేశ్వర గౌడ్‌, వడ్లకొండ కనకయ్య గౌడ్‌, నోముల శ్రీనివాస్‌ గౌడ్‌, సట్ల సంతోష్‌, రంగు రవిందర్‌, బండి శంకర్‌ గౌడ్‌, బుర్ర ఆంజనేయులు, పోతునూరి ప్రభాకర్‌ గౌడ్‌, బండారి శ్రీనివాస్‌, తాళ్లపేల్లి శ్రీనివాస్‌, కొయ్యడ కుమార్‌ గౌడ్‌, రంజిత్‌ గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:24 PM