గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
ABN, Publish Date - Jan 07 , 2025 | 10:59 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
కోటపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. నక్కలపల్లి రహదారిలోని లోతొర్రె వద్ద రూ.15 లక్షలతో నిర్మించిన లో లెవెల్ వంతెనను కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. కోటపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు రాక ఇబ్బందులు ఉన్నాయని, అటవీ శాఖ అనుమతుల కోసం ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఇటీవల కేంద్ర మంత్రితో మాట్లాడామని, త్వరలోనే అనుమతులు వస్తాయని తెలిపారు. నక్కలపల్లి దారిలో వర్షాకాలంలో లోతొర్రె ఇబ్బందులు ఉండేవని, సమస్య తీరుతుందన్నారు. త్వరలోనే నక్కలపల్లి రహదారికి నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. మల్లంపేట, కోటపల్లి గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా మల్లంపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలు వేసి నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి, నాయకులు రాజమల్లగౌడ్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
చెన్నూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరు పట్టణంలో రూ.20 లక్షలతో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌తోపాటు రూ. 1.30 లక్షల నిధులతో మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలకు శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వంద కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో నేతకాని, ముదిరాజ్ భవన నిర్మాణాలకు త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీకృషి చేస్తుందన్నారు. పది సంవత్సరాల నుంచి పట్టణంలో అధ్వాన్నమైన రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 07 , 2025 | 10:59 PM