ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి

ABN, Publish Date - Jan 10 , 2025 | 04:53 AM

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

  • సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్యం విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని, ఇది ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అంటూ రేవంత్‌కు గురువారం బండి లేఖ రాశారు.


‘ఆరోగ్యశ్రీ’ పథకం అమలులో సీఎం అనుసరిస్తున్న తీరు ‘నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా’ ఉందని, ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య ేసవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించి, ఆచరణలో మాత్రం అసలు బిల్లులే చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను ఇబ్బంది పెడుతున్నారని లేఖలో విమర్శించారు. ‘‘మీ ఏడాది పాలనలో దాదాపు రూ.1000 కోట్ల మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నాయి. ఫీజు రీయిబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రూ.7వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వన్‌టైం సెటిల్‌మెంట్‌ పద్ధతిలో క్లియర్‌ చేయాలి’’ అని లేఖలో బండి పేర్కొన్నారు.


ఉచిత సర్జరీ క్యాంప్‌ అభినందనీయం

సేవా భారతి, లయన్స్‌ క్లబ్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌, మెర్సీ మిషన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 30 వరకు మల్లేపల్లి సీతారాంబాగ్‌ ప్రాంతంలోని డాక్టర్‌ ఈశ్వర్‌ చంద్ర ఆస్పత్రిలో ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ నిర్వహిస్తుండటం అభినందనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. కాగా, ఈ మెగా క్యాంప్‌లో పాల్గొనాలనుకునే వారు 9848241640, 9908630301 నంబర్లకు ఫోన్‌ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

Updated Date - Jan 10 , 2025 | 04:53 AM