BC Reservations: 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇవ్వాలి: ఆర్‌ కృష్ణయ్య

ABN, Publish Date - Mar 24 , 2025 | 03:50 AM

విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని 26 బీసీ కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

BC Reservations: 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇవ్వాలి: ఆర్‌ కృష్ణయ్య

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని 26 బీసీ కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రానికి పంపి చేతులు కట్టుకుని కూర్చోకుండా పార్లమెంట్‌లో దానిని ఆమోదించే వరకు పోరాటం కొనసాగించాలని పేర్కొన్నారు. ఆదివారం బీసీ భవన్‌లో 26 బీసీ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది.


ఈ సమావేశంలో బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్‌ చేయడం చారిత్రాత్మకమని అన్నారు. వాటి అమలుకు తక్షణం జీవోలు జారీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 24 , 2025 | 03:50 AM