ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘నవమి’ నాటికి షెడ్లు నిర్మించలేం

ABN, Publish Date - Mar 16 , 2025 | 05:16 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో చేపట్టిన షెడ్ల నిర్మాణం శ్రీరామనవమి నాటికి పూర్తి చేయలేమని సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టరుకు నివేదించినట్లు సమాచారం.

  • అధికారులకు నివేదించిన కాంట్రాక్టర్లు

భద్రాచలం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో చేపట్టిన షెడ్ల నిర్మాణం శ్రీరామనవమి నాటికి పూర్తి చేయలేమని సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టరుకు నివేదించినట్లు సమాచారం. రూ.1.60 కోట్లతో ప్రసాద్‌ పథకంలో భాగంగా ఈ పనులను చేపడుతుండగా గత ఏడాది అక్టోబరులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 6వ తేదీన శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం ఇదే స్టేడియం ప్రాంగణంలో నిర్వహించనున్నారు.


ఈ క్రమంలో ఇటీవల జిల్లా కలెక్టరు జితేష్‌ వి. పాటిల్‌ నవమికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై నిర్వహించిన ముందస్తు సమావేశంలో పనులను వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అయితే షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు పునాది స్థాయి వరకు చేసి శ్రీరామనవమి అనంతరం మళ్లీ చేపడతామని చెప్పినట్లు సమాచారం.

Updated Date - Mar 16 , 2025 | 05:16 AM